ఈడీ కొత్త బాస్‌గా రాహుల్ నవీన్: ముగిసిన సంజయ్ మిశ్రా పదవీ కాలం
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 1993 బ్యాచ్ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (IRS) అధికారి రాహుల్ నవీన్‌ను న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెగ్యులర్ డైరెక్టర్ నియామకం జరిగే వరకు మనీలాండరింగ్ నిరోధక సంస్థ అత్యున్నత పదవిలో ఆయన కొనసాగుతారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెగ్యులర్ డైరెక్టర్‌ని నియమించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే, అప్పటి వరకు రాహుల్ నవీన్ కొనసాగుతారని ప్రభుత్వం నుంచి విడుదలైన ఒక ఉత్తర్వు పేర్కొంది. కాగా, జూలైలో, భారత సుప్రీంకోర్టు ED చీఫ్ మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది, అయితే తదుపరి పొడిగింపు లేదని స్పష్టం చేసింది.

మిశ్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా ప్రతిసారీ ఒక సంవత్సరం పాటు సర్వీస్ పొడిగింపును మంజూరు చేస్తూ కేంద్రం చేసిన రెండు నోటిఫికేషన్‌లను "చట్టవిరుద్ధం"గా పరిగణించిన కొద్ది రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది.
ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్ఏటీఎఫ్) సమీక్ష కొనసాగుతున్నందున మిశ్రాను అక్టోబర్ 15 వరకు కొనసాగించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికీ.. అందుకు నిరాకరించింది అత్యున్నత న్యాయస్థానం. చివరకు సెప్టెంబర్ 15 వరకు ఈడీ డైరెక్టర్‌గా ఆయన్ను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో పూర్తయ్యింది. ఈ క్రమంలోనే ఈడీ తాత్కాలిక అధిపతిగా రాహుల్ నవీన్‌ను కేంద్రం నియమించింది.












Click it and Unblock the Notifications