మీ సమస్యలు చెప్పండి: రైలులో ప్రయాణించిన కేంద్రమంత్రి పీయూష్

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎవరూ ఊహించని విధంగా ఆదివారంనాడు కోట జన్‌శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రజలతో కలిసి ప్రయాణం చేశారు. రైలులో సదుపాయాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఏయే ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలనే విషయంలోనూ ప్రయాణికులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలను రాబట్టారు. సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇటీవల కాలంలో ఎదురురవుతున్న పెరుగుతున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ ఆకస్మిక ప్రయాణం జరిపారు.

అక్టోబర్ ప్రారంభంలో పీయూష్ గోయెల్ రైల్వే బోర్డుకు స్పష్టమైన ఆదేశాలిస్తూ వారానికి ఒకసారి రైల్వే బోర్డు సమావేశం కావాలని, పెండింగ్ సమస్యలను త్వరిగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

అంతేగాక, రైల్వేల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ అవసరమైన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జోనల్ జనరల్ మేనేజర్లకు అపరిమితమైన అధికారులు కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

కాగా, కేంద్రమంత్రి స్వయంగా రైలులో ప్రయాణికులతోపాటు జర్నీ చేసి వారి సమస్యలను తెలుసుకోవడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిసారి ఓ రైల్వే మంత్రి ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు రైలు జర్నీ చేశారంటూ కొనియాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a surprise move, Railway Minister Piyush Goyal today travelled in the Kota Janshatabdi Express, and took the feedback of passengers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి