రైల్వేలో టీటీఈగా ఉద్యోగం, సినిమాట్లో నటించాడు, రైలులో టీటీఈని ఎలా చంపేశాడంటే!
రైలులో వేలాది మంది ప్రయాణికులు వారి గమ్యం చేరుకోవడానికి ప్రయాణిస్తుంటారు. టిక్కెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న వారిని గుర్తించి వారికి అపరాదరుసుం విదించడానికి ప్రభుత్వం టీటీఈలను నియమించింది. రైలులో ప్రతినిత్యం టీటీఈలు టిక్కెట్లు తీసుకోకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించి అపరాదరుసుం విధించడంతో పాటు అపరాద రుసుం చెల్లించిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే రైలులో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. సెంట్రల్ కేరళ జిల్లాలో టికెట్ లేని ప్రయాణీకుడు కదులుతున్న రైలు నుండి టీటీఈని వేగంగా వెలుతున్న రైలులో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తోసేసిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలప్పయ్య ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.హత్యకు గురైన టీటీఈని కేరళలోని ఎర్నాకులం నివాసి కె వినోద్ అలియాస్ వినోద్ గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వే శాఖలో వినోద్ టీటీఈగా ఉద్యోగం చేస్తున్నాడు. వినోద్ విధులు నిర్వహిస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని ప్రశ్నించాడు. ఆ సమయంలో టిక్కెట్ లేకుండా రైలులో సంచరిస్తున్న ఆ ప్రయాణికుడు టీటీఈ వినోద్ ను రైలులో నుంచి కిందకు తోసేశాడు.
ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు సత్వరమే స్పందించి నిందితుడైన ప్రయాణికుడిని పాలక్కాడ్‌లో అరెస్టు చేశారు. టికెట్ లేదని ప్రశ్నించిన తర్వాత ప్రయాణీకుడు వినోద్‌ను కదులుతున్న రైలు నుండి కిందకు తోసేశాడని, టీటీఈ వినోద్ ను హత్య చేసింది వలస కార్మికుడు అని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎదురుగా వెళ్తున్న మరో రైలు టీటీఈ వినోద్ శరీరంపై నుంచి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు త్రిసూర్ స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. వినోద్ కు కేవలం 40 ఏళ్లు ఉన్నాయని,, నిజాయితీగల అధికారిగా అతను రైల్వే శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, అతను కొన్ని మళయాలం సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు కూడా నటించాడని అతని సహచర ఉద్యోగులు అంటున్నారు.












Click it and Unblock the Notifications