రైల్వేశాఖ కీలక నిర్ణయం- మాస్క్ లేకపోతే రూ.500 ఫైన్- ఎక్కడెక్కడంటే ?
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రైల్వేస్టేషన్లతో పాటు రైళ్లలోనూ కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం వేసవి కావడంతో పాటు కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు, కర్పూలు విధిస్తుండటంతో వలస కార్మికులు సైతం స్వస్దలాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. వీరిలో చాలా మంది మాస్కుల్లేకుండానే ప్రయాణాలు చేసేస్తున్నారు. దీంతో కోవిడ్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీంతో ఇకపై రైళ్లలో కానీ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో కానీ మాస్కులు ధరించకుండా కనిపిస్తే రైల్వే పోలీసులు పట్టుకుని రూ.500 జరిమానా విధించబోతున్నారు.

వాస్తవానికి కరనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వేశాఖ గతేడాది మే 11న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులోనే రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. అయితే జరిమానాలు మాత్రం విధించలేదు. ఇప్పుడు మాస్క్‌ల వినియోగాన్ని రైల్వే చట్టంలోని నిబంధనల కిందకు తీసుకొచ్చారు. ఇందులో ఇప్పటికే రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఉమ్మడం వంటి చర్యలకు జరిమానాలు ఉన్నాయి. వీటితో పాటు మాస్క్ వాడకపోయినా జరిమానా విధించబోతున్నారు.












Click it and Unblock the Notifications