వీడియో: చూరు కారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం కేరళకు కేటాయించిన మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో డొల్లతనం బయటపడింది. భారీ వర్షాలకు ఈ రైలు చూరు లీక్ కావడంతో బోగీల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షపు నీటిని సిబ్బంది టబ్స్‌తో పట్టుకుంటోండటం ఈ వీడియోలో రికార్డయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో స్వయంగా పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. మొత్తం 11 జిల్లాలు- తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, పథనంథిట్ట, మళప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల మీదుగా రాకపోకలు సాగిస్తోంది.

తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ రైలుకు కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిశూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్‌లల్లో హాల్ట్ సౌకర్యం కల్పించారు. కిందటి నెలలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారి ఈ రైలు టాప్ లీక్ కావడం వల్ల వర్షపు నీరు లోనికి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది దీనికి మరమ్మతు చేశారు. నీరు లోనికి ప్రవేశించకుండా రబ్బర్ బెండ్స్ అమర్చారు.
Farewell blankets, hello umbrellas: Vande Bharat redefines comfort. pic.twitter.com/8mTKeaqkYL
— Congress Kerala (@INCKerala) June 14, 2023
ఇప్పుడు తాజాగా మళ్లీ అదే తరహా పరిస్థితి కనిపించింది. రుతు పవనాల రాకతో కొద్దిరోజులుగా కేరళ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- కన్నూర్ సమీపంలో కురిసిన భారీ వర్షానికి బోగీలోకి వర్షపు నీరు ప్రవేశించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కేరళ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వందే భారత్‌లో ప్రయణికులకు గొడుగులు సప్లై చేసే పరిస్థితి ఏర్పడిందంటూ కామెంట్స్ పెట్టింది.












Click it and Unblock the Notifications