దుర్భర రైలు ప్రయాణం: అవంతిక ఎక్స్‌ప్రెస్‌లో లీక్- తడిచి ముద్దయిన ప్రయాణికులు

ముంబై: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తోన్నాయి. ఈ సీజన్‌లో ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తరువాత వేగం పుంజుకొన్నాయి. దేశమంతటా క్రమంగా విస్తరిస్తోన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌కూ విస్తరించాయి.

ఆయా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయింది. అటు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లల్లో అసాధారణ వర్షపాతం నమోదవుతోంది. దేశ రాజధానిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain water leaks from AC coach of Avantika Express

మహారాష్ట్రపై వర్షాల తీవ్రత అధికంగా ఉంది. రాయ్‌గఢ్, పాల్‌ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్, థానేల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబైలో 24 గంటలుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాహనాల రాకపోకలు అస్తవ్యస్తం అయ్యాయి. అత్యధికంగా కొలాబాలో 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ముంబై శివార్లతో పాటు థానే జిల్లాలో 176.10 మిల్లీమీటర్ల వర్షం కురిసనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మలద్, అంధేరి, వర్లి, మిలాన్, చెంబుర్, దాదర్ టీటీ సర్కిల్, సియాన్, కళ్యాణ్.. వంటి ప్రాంతాలు తడిచిముద్దయ్యాయి. బలమైన ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అంధేరీలో పర్యటించారు.

అటు వర్షాల దెబ్బ- రైళ్ల రాకపోకలను ప్రభావితం చేసింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని కొన్ని మార్గాల్లో రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రూట్లల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తోన్నాయి. మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు అధికారులు. పలు చోట్ల పట్టాలపై నీళ్లు చేరుకోవడంతో ఆయా మార్గాల్లో తిరిగే సబర్బన్ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి.

ముంబై- ఇండోర్ మధ్య రాకపోకలు సాగించే అవంతిక ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వర్షాల ధాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్ టాప్ లీక్ అయింది. వర్షం ధారగా కురిసింది. ప్రయాణికులు తడిచిపోయారు. తమ లగేజీని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. కోచ్ ఫ్లోర్ మొత్తం నీళ్లు పారాయి. బిక్కు బిక్కు మంటూ గడిపారు ప్రయాణికులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+