వామ్మో.. దేవుడిపై కోపంతో 15 ఏళ్లుగా ఈ HIV పేషంట్ ఏం చేస్తున్నాడో తెలుసా..?
హెచ్ఐవీ వ్యాధి బారిన పడిన ఓ వ్యక్తి తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించాడు. అలా దేవుడిపైనే కోపం, పగ పెంచుకున్నాడు. దేవుడి మీద కోపంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అలా 15 ఏళ్లుగా కేవలం గుళ్లలోనే చోరీలు చేయడం ప్రారంభించాడు. హుండీలోని నగదు, ఇతర కానుకలు మాత్రమే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడ్డాడు. 15 ఏళ్ల పాటు అనేక ఆలయాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
సాధారణంగా పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తుంటారు. మరికొందరు విలాసవంతమైన లైఫ్ కోసం చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా దేవుడిపై కోపంతో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అదీ కూడా ఓ హెచ్ఐవీ పేషంట్ కావడం గమనార్హం. తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించిన ఆ వ్యక్తి కేవలం గుడిలోనే చోరీలు చేస్తున్నాడు. అలా 15 ఏళ్లుగా అనేక ఆలయాల్లో దోపిడీలకు పాల్పడిన ఆ దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యశ్వంత్ ఉపాధ్యాయ్ 2012లో ఓ కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. అయితే అప్పుడు తనకు హెచ్ఐవి వ్యాధి సోకిందని తేలింది. అయితే తన అనారోగ్యానికి దేవుడే కారణం అని భావించాడు. దీంతో జైలు నుంచి బయటకు వచ్చాక అనేక గుళ్లలో దోపిడీలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల ఆగస్టు 23 అర్ధరాత్రి దుర్గ్ టౌన్ లోని ఓ జైన మందిరంలో యశ్వంత్ ఉపాధ్యాయ్ దోపిడీ చేస్తుండగా పోలీసులకు చిక్కాడు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి.. నిందితుడికి 14 రోజులపాటు జుడిషియల్ కస్టడీ విధించింది.
విచారణలో భాగంగా యశ్వంత్ ఉపాధ్యాయ్ చెప్పిన వివరాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. తనకు హెచ్ఐవీ ఉందని తేలిందని.. తన అనారోగ్యానికి దేవుడే కారణం అని దోపిడీలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దేవుడిపై పగతో దేవుడి ఆస్తినే కాజేయాలని ప్లాన్ తో 15 ఏళ్లుగా కేవలం గుడిలో మాత్రమే దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై దుర్గ్ ఎస్పీ విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. యశ్వంత్ ఉపాధ్యాయ్ మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. దేవుడి గుడుల్లో దొంగతనాలు చేసి ఆ తర్వాత ఆస్తులు కూడగట్టినట్లు తేలిందన్నారు. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడేవాడని.. హుండీలోని నగదు, ఇతర కానుకలను దొంగిలించి పరారయ్యేవాడని తెలిపారు. దొంగతనం తర్వాత తాను ఆలయ విగ్రహం ముందుకి వెళ్లి నమస్కరించి పారిపోయేవాడినని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. యశ్వంత్ ఉపాధ్యాయ్ వ్యక్తిగత సమస్యలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఈ కారణంగా అతడు దేవునిపై కోపం పెంచుకున్నాడని తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications