వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌ కుంద్రా కేస్: ప్రస్తుత చట్టాలు పోర్న్‌ను అడ్డుకోగలవా? లోపం ఎక్కడుంది ?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా అరెస్టు తర్వాత అసలు మన దేశంలో పోర్న్ చిత్రాలు, వీడియోలను అడ్డుకునే చట్టాలు ఎంత మాత్రం పని చేస్తున్నాయనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇలాంటి కేసులలో కఠిన చర్యలు చేపట్టాలంటున్న నిపుణులు, ఇందుకోసం పాత చట్టాలలో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చట్టాల్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని రాజ్‌ కుంద్రా లాంటి వారు తప్పించుకునే అవకాశం కూడా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరి నిజంగా చట్టాలు కఠినంగా లేవా ? నిందితులకు శిక్షలు పడేలా చేయలేవా?

రాజ్‌ కుంద్రా ఇటీవలే అరెస్టయినా, ఆయనపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక మోడల్‌ చేసిన ఆరోపణలతో ఈ అశ్లీల వీడియోల వ్యవహారం మొత్తం బైటపడింది.

సదరు మోడల్ ఆరోపణల తర్వాత, ఆమె పేర్కొన్న ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీడియో చాట్ ద్వారా నగ్నంగా ఆడిషన్‌లో పాల్గొనాల్సిందిగా నిందితులు తనను కోరినట్లు ఆ మోడల్ వెల్లడించారు.

ఇదే కేసులో మరో నటి కూడా ఫిర్యాదు చేశారని, ఈ ఆరోపణల ఆధారంగా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఉమేశ్ కామత్‌ పై ఆరోపణలు చేసిన ఆర్టిస్టులకు వెబ్‌ సిరీస్ లేదంటే ఓటీటీ ప్లాట్‌ఫాంపై సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

షూటింగ్ ప్రారంభమైన రోజున పోర్న్ దృశ్యాల్లో నటించేలా ఈ మహిళా నటులపై ఒత్తిడి చేసినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు.

షూటింగ్ పూర్తయిన తర్వాత, వాటిని కొన్ని మొబైల్ యాప్‌లలో కూడా అప్‌లోడ్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రాజ్‌కుంద్రాపై ఆరోపణలు

రాజ్‌ కుంద్రా పోర్న్ చిత్రాలను నిర్మించడంతో పాటు వాటిని యూకే ఆధారిత నిర్మాణ సంస్థ యాప్ ద్వారా అప్‌లోడ్ చేశారని పోలీసులు చెప్పారు. అశ్లీల చిత్రాల నిర్మాణం, పంపిణీ, షేరింగ్‌లాంటివి భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత చర్యలు.

దీంతో కుంద్రా, ఇతర నిందితులపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 292, 293 కింద, ఐటీ చట్టంలోని సెక్షన్ 420, సెక్షన్ 67, 67 ఎ కింద కేసులు నమోదయ్యాయి.

ఇది కాకుండా అశ్లీలంగా నటించేలా మహిళలపై ఒత్తిడి చేసినందుకు ప్రత్యేక సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు.

2013 సంవత్సరంలో 'క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్' ఆరోపణలపై రాజ్ కుంద్రాను దిల్లీ పోలీసులు ప్రశ్నించారు.

2015 లో 'బెస్ట్ డీల్ టీవీ' అనే 'హోమ్ షాపింగ్ ఛానల్' ప్రమోటర్‌గా రాజ్ బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే ఆయన లైవ్‌ స్ట్రీమింగ్ మీడియా యాప్ 'జల్ది లైవ్ స్ట్రీమ్ యాప్'ను ప్రారంభించారు.

చట్టం ఏం చెబుతోంది?

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం ఒక కరపత్రం, పేపర్, సాహిత్యం, చేతితో గీసిన బొమ్మ, కుంచెతో వేసిన చిత్రం, ప్రతిమ మరేదైనా వస్తువు అశ్లీలంగా కనిపించి శృంగార వాంఛను కలిగించేలా, రెచ్చగొట్టేలా ఉంటే, అలాంటి వాటిని అశ్లీలత కేటగిరీగా భావిస్తారు.

ఇలాంటి అశ్లీల వస్తువుల తయారీ, అమ్మకం, దిగుమతి-ఎగుమతి, ప్రకటనలతో పాటు దాని ద్వారా ఆర్ధికంగా లాభం పొందడం కూడా నేరమని చట్టం పేర్కొంటోంది.

ఐపీసీలోని సెక్షన్ 293, 294 సెక్షన్ల ప్రకారం 20 ఏళ్లలోపు వారికి అటువంటి వాటిని అమ్మడం లేదా షేర్ చేయడం కూడా నేరమే. అలాగే, బహిరంగ ప్రదేశాలలో అశ్లీల కార్యక్రమాలలో పాల్గొనడం, అశ్లీలతతో కూడిన పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం కూడా శిక్షార్హమే.

తన యాప్‌లో రాజ్‌ కుంద్రా ఇలాంటి అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అశ్లీల చిత్రాలలో తమను బెదిరించి నటింపజేశారని కొందరు మహిళా నటులు చేసిన ఆరోపణలతో రాజ్ కుంద్రా వ్యవహారం బైటికొచ్చింది.

భారతదేశపు పోర్నోగ్రఫీ చట్టాలలో పోర్న్ చూడటం నేరంగా పేర్కొనలేదు. కేవలం వాటి తయారీ, వ్యాప్తి, పంపిణీలనే నేరంగా చట్టాలు పేర్కొంటున్నాయి.

ఇలాంటి కేసులలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉంటే వీటికి అదనంగా కొన్ని సెక్షన్లు జత అవుతాయి. రాజ్ కుంద్రా కేసులో అబ్‌సీన్ రిప్రజెంటేషన్ (ప్రొహిబిషన్) ఆఫ్ విమెన్ చట్టంలోని 3,4,6,7 సెక్షన్‌లను కూడా చేర్చారు.

బెదిరింపుల కారణంగా తాము పోర్న్ చిత్రాలలో నటించవలసి వచ్చిందని ఉమేశ్ కామత్‌పై ఆరోపణలు చేసిన మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

చట్టాలు పని చేస్తాయా?

ఇప్పుడు ఈ చట్టంలోని సెక్షన్ల గురించి చర్చ జరుగుతోంది. ఈ పాత కాలపు చట్టంతో ఆధునిక యుగపు నేరాలను అదుపు చేయలేమని నిపుణులు అంటున్నారు.

''1860 నాటి ఈ చట్టంలో సెక్షన్లను మరింత స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. ఇది నిందితుల నేరం, శిక్ష, పాత్ర, అధికార పరిధిని స్పష్టంగా వివరించాలి'' అని న్యాయవాది విరాగ్ గుప్తా అన్నారు.

రాజ్‌ కుంద్రా కేసులో నిందితులు ఉపయోగించిన యాప్ బ్రిటన్ నుంచి పని చేస్తుంది కాబట్టి ఇందులో భారత పోలీసులు, దర్యాప్తు అధికారుల పరిధి మారుతోందని ఆయన అన్నారు.

మరోవైపు, ప్రభుత్వం ఇటీవల ఐటీ యాక్ట్‌లో కొత్త నిబంధనలను చేర్చిందని, కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో అశ్లీలతకు అడ్డుకట్ట వేయడానికి సరైన విధానాలు ఇప్పటికీ లేవని విరాగ్ గుప్తా అన్నారు.

''ప్రస్తుతం ఉన్న చట్టంలో సినిమాలు, ఇంటర్నెట్‌ల ప్రస్తావన లేదు. దాంతో, ఐటీ చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి'' అని న్యాయవాది రోహిన్ దూబే అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Raj Kundra Case: Can Current Laws Prevent Porn? Where is the error?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X