Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pornography Case : శిల్పాశెట్టి ఇంట్లో పోలీసుల సోదాలు-భర్త పోర్న్ లింకులపై ప్రశ్నించనున్న క్రైమ్ బ్రాంచ్

సంచలనం రేపుతున్న పోర్నోగ్రఫీ కేసులో ఏ క్షణం ఎవరి అరెస్టు జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నగరంలోని జుహు ప్రాంతంలో ఉన్న శిల్పా శెట్టి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను వెంటపెట్టుకుని పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. పోర్నోగ్రఫీ వ్యవహారంలో శిల్పాశెట్టికి సంబంధం ఉందా అన్న కోణంలో ఈ సందర్భంగా పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

శిల్పాశెట్టి స్టేట్‌మెంట్ రికార్డ్...

శిల్పాశెట్టి స్టేట్‌మెంట్ రికార్డ్...

క్రైమ్ బ్రాంచ్ విచారణకు శిల్పాశెట్టి ఇప్పటికే ఓకె చెప్పినట్లు సమాచారం. దీంతో జుహులోని ఆమె ఇంట్లో పోలీసులు ఆమె వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. ముంబైలోని వియాన్ కంపెనీకి కార్యాలయంలోనే రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించారన్న ఆరోపణలున్నాయి. గతంలో శిల్పాశెట్టి వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టికి పోర్నోగ్రఫీ కార్యకలాపాల గురించి తెలుసా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఏ పరిస్థితుల్లో వియాన్ కంపెనీ డైరెక్టర్‌గా తప్పుకున్నారన్న వివరాలు కూడా రాబట్టనున్నారు.

శిల్పాశెట్టిని అరెస్ట్ చేస్తారా...?

శిల్పాశెట్టిని అరెస్ట్ చేస్తారా...?


రాజ్‌కుంద్రా ఇంట్లో సోదాల నేపథ్యంలో పోర్నోగ్రఫీకి సంబంధించి కీలక ఆధారాలు దొరికితే ఆయన చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకున్నట్లే. అదే సమయంలో శిల్పాశెట్టిని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజ్‌కుంద్రాకు సహకరించినట్లు ఏమాత్రం ఆధారాలు లభించినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏ క్షణమైనా శిల్పాశెట్టి అరెస్టు అన్న వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి.

Recommended Video

    Shilpa Shetty skips her shooting as raj kundra got arrested | Oneindia Telugu
    ఇప్పటివరకూ 11 మంది అరెస్ట్

    ఇప్పటివరకూ 11 మంది అరెస్ట్

    ప్రముఖ వ్యాపారవేత్త,గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరించిన రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మించే స్థాయికి దిగజారడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. పోర్న్ చిత్రాల ద్వారా ఆయన పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆయన బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. నిజానికి ఈ కేసు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటపడింది. అయితే అప్పట్లో ఏసీబీకి రూ.25 లక్షలు లంచం ఇచ్చి రాజ్‌కుంద్రా తప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకూ 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మున్ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+