ఐఎస్ఐ కోసం పని చేస్తున్న మాజీ సైనికోద్యోగి అరెస్ట్
జైపూర్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ సైనికోద్యోగిని ఏటిఎస్ పోలీసులు ఆదివారం రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. రాజస్థాన్ ఏటీఎస్(యాంటీ టెర్రరిస్ట్ స్వా్కడ్), ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు.
ఈ దాడుల సందర్భంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ ఆర్మీ అధికారి పట్వారీ గోవర్థన్ రామ్‌ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయన సైన్యంలో హవల్దార్‌గా పనిచేశారు. అతనిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ప్రస్తుతం పట్వారీగా పని చేస్తున్న గోవర్ధన్ రామ్.. భారత భద్రతకు సంబందించిన పలు విషయాలను ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు అదికారులు తెలిపారు. ఇటీవల కోల్‌కతాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐఎస్ఐ ఏజెంట్ షేక్ మొఘల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐఎస్ఐ ఏజెంట్లుగా పని చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications