ఆటోలో షికార్లు కొట్టిన సీఎం వసుంధరా రాజే (ఫోటోలు)
జైపూర్: ఆమె ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రతి నిత్యం బయటకు వెళ్లాలంటే బుల్లెట్ ప్రూఫ్ కారు, పెద్ద కాన్వాయ్, గట్టి పోలీసు బందోబస్తు, ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండ ఫ్రీ సిగ్నల్ కారిడార్ ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు దర్శనం ఇస్తారు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకి ఇవి బోర్ కొట్టాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే జైపూర్ లో అందమైన తెల్ల రంగు ఆటో ఎక్కి షికార్లు కొట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సామాన్య మహిళగా, ప్రయాణికురాలిగా జైపూర్ వీధులలో సంచరించారు. ఎలాంటి హంగూ అర్బాటం లేకుండ రోడ్ల మీద సంచరించారు.

వెంట అధికారులు, సెక్యూరిటి సిబ్బంది లేరు. ఇలా అందంగా ముస్తాబు అయిన ఆటోలలో మీరు జైపూర్ లో షికార్లు చెయ్యండి అంటూ వసుంధరా రాజే తన అధికారిక ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేశారు. ఆటోలో సంచరించినందుకు తనకు చాల ఆనందంగా ఉందని అంటున్నారు.
ఇలా ఆటోలో సంచరించడం చాల థ్రిల్ గా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మీరు ఇలాంటి కళాత్మక ఆటోలను చూసినా, వాటిలో సంచరించినా ఆ ఫోటోలను ఆర్ట్ ఆన్ వీల్స్అనే హ్యాప్ లో ట్యాగ్ చెయ్యాలని పిలుపునిచ్చారు. వసుంధరా రాజే చేసిన ట్విట్ లకు విపరీతమైన స్పందన వస్తున్నది.
My wonderful ride today -- when you catch these beautiful autos in Jaipur, tweet back with pictures! #ArtOnWheels pic.twitter.com/kDmpPwxEoV
— Vasundhara Raje (@VasundharaBJP) November 3, 2015 











Click it and Unblock the Notifications