Rajasthan polls: రాజస్తాన్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల-కులగణన, 4 లక్షల ఉద్యోగాల సహా...

మరో నాలుగు రోజుల్లో జరిగే రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఇవాళ విడుదల చేసింది. జైపూర్ లో జరిగిన మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. నవంబర్ 25న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే కులాల సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.

రాజస్థాన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పలు కీలక అంశాలున్నాయి. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం రైతులకు 2 లక్షల వడ్డీ లేని రుణం, కనీస మద్దతు ధర హామీ ఇచ్చింది. అలాగే పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొత్త పథకాలతో పాటు ప్రస్తుత పథకాలను మరింత బలోపేతం చేస్తామని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.

Rajasthan congress manifesto promises caste census, 4 lakh jobs, 2 lakh interest free farmer loans

రాజస్తాన్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతుల కోసం ఎంఎస్‌పీ చట్టం తీసుకురావడం,చిరంజీవి బీమా మొత్తాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడం, 4 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడం వంటి హామీలున్నాయి. అలాగే పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల కొత్త కేడర్ సృష్టిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం రూ.500కు లభిస్తున్న గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని తెలిపింది. విద్యాహక్కు చట్టం ప్రకారం 12వ తరగతి వరకూ ఉచిత విద్య కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది.

ఉపాధి హామీ, ఇందిరాగాంధీ పట్టణ ఉపాధి పథకాల్లో పని దినాల్ని 125 నుంచి 150 రోజులకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించింది. చిరు వ్యాపారులు, దుకాణదారులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించేందుకు మర్చంట్ క్రెడిట్ కార్డ్ పథకం ప్రారంభిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు 9,18,27తో పాటు నాల్గవ వేతన స్కేలు, అధికారులకు అపెక్స్ స్కేల్ ఇవ్వనున్నారు. 100 వరకు జనాభా ఉన్న గ్రామాలు, కుగ్రామాలకు రహదారుల అనుసంధానం చేస్తారు. ప్రతి గ్రామం, పట్టణ వార్డులో సెక్యూరిటీ గార్డులను నియమిస్తారు.

Rajasthan congress manifesto promises caste census, 4 lakh jobs, 2 lakh interest free farmer loans

హౌసింగ్‌ టు హౌసింగ్‌ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే అమలవుతున్న పథకాలను మరింత బలోపేతం చేయనున్నారు. తమ వాగ్దానాలలో 97 శాతం నెరవేర్చామని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు మొదటి క్యాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోను సమర్పించి 97 శాతం హామీల్ని నెరవేర్చినట్లు గెహ్లాట్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+