వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.... ఏమి జరిగి ఉంటుంది..?

|
Google Oneindia TeluguNews

బికనేర్ : రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానంకూలిపోయింది. బికనేర్‌లోని శోభసర్‌కి ధాని ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫైటర్ జెట్ కూలిపోయింది. అయితే ఇందులోని పైలట్ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. ప్రాథమిక విచారణ ప్రకారం ఓ పక్షి ఈ యుద్ధ విమానంను ఢీకొట్టి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

యుద్ద విమానం కూలిపోవడంపై విచారణకు ఆదేశించారు అధికారులు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేసి నివేదిక అందించనున్నారు. ఫిబ్రవరి 27న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-17 హెలికాఫ్టర్ జమ్ము కశ్మీర్‌లోని బుడ్గామ్‌లో కూలిన ఘటన మరువకముందే మరో యుద్ధ విమానం కూలిపోయింది. హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఆరుగురు అధికారులు ఒక పౌరుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.

<strong>బాల‌కృష్ణ అక్క‌డి నుండే : జేసి బ్ర‌దర్స్ దూరం : ప‌రిటాల శ్రీరాం కు అవకాశం లేన‌ట్లే..!</strong>బాల‌కృష్ణ అక్క‌డి నుండే : జేసి బ్ర‌దర్స్ దూరం : ప‌రిటాల శ్రీరాం కు అవకాశం లేన‌ట్లే..!

Rajasthan: Fighter jet crashes near Bikaner, pilot ejects safely

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లో కూలగానే శతృదేశం ఏమైనా దాడి చేసిందా అనే అనుమానాలు ముందుగా ప్రతిఒక్కరిలో వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు వివరణ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి విమానప్రమాదాలు జరుగుతుండటం కలవరపెడుతోంది. ఫిబ్రవరి 26న పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి రావడంతో ఆ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో మిగ్-21 యుద్ధ విమానం వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్‌ సైన్యానికి బందీగా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండురోజులకు అంటే మార్చి 1న ఆయన్ను పాకిస్తాన్ విడుదల చేసింది.

English summary
An Indian Air Force plane crashed in Rajasthan's Bikaner on Friday. According to local media reports, it happens to be a MiG-29 fighter jet. The initial reports suggest that the pilot is safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X