రాజస్థాన్ మగాళ్ల రాష్ట్రం: రేప్ కేసుల్లో అందుకే మొదటిస్థానంలో అంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: అత్యాచార ఘటనలపై స్పందిస్తూ రాజస్థాన్ అసెంబ్లీలో ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసుల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని... ఎందుకంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం అని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి కుమార్ ధరివాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ధరివాల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతోపాటు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఈ విషయంలో మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.

కాగా, జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇలాంటి మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏం చేయడం లేదు. ఇలాంటి మంత్రులు ఉంటే రాష్ట్ర మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
#WATCH | Rajasthan Minister Shanti Kumar Dhariwal says in Assembly, "...We are number 1 when it comes to rape cases. Why is it so?...Rajasthan has been a land of men. What we can do about it?..." (09.03.2022)
— ANI (@ANI) March 10, 2022
(Source: Rajasthan Assembly) pic.twitter.com/cqSSybvaSC
Recommended Video
సంబంధిత మంత్రిని సభ సనుంచి సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు రేఖా శర్మ. అయితే, సర్వత్రా విమర్శలు వస్తున్న క్రమంలో తాను నోరు జారానని, క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి శాంతి కుమార్ ధరివాల్ ప్రకటించారు. తాను ఎప్పుడూ మహిళలను గౌరవిస్తానంటూ క్షమాపనలు చెప్పారు. కాగా, రాష్ట్రంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. దీంతో మంత్రి చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications