Rajasthan polling: రాజస్తాన్ లో 3 గంటల వరకూ 55 శాతం పోలింగ్-రాళ్ల దాడులు..
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని 199 సీట్లలో ఇవాళ జరుగుతున్న పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు తరలివచ్చి ఓటు వేస్తున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, వసుంధరా రాజే సింధియాతో పాటు పలువురు ప్రముఖ నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
సికర్ లో పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చిన కొందరు వ్యక్తుల మధ్య మాటల గొడవ జరగడంతో రాళ్లదాట్ల దాడి జరిగిందని, కొంతమందికి డబ్బు పంచారని.. ఈ ఘటనలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఘర్షణలు జరిగిన స్ధలం పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్నట్లు స్ధానిక ఎస్పీ ప్రకటించారు. మరికొన్ని చోట్ల కూడా రాళ్లు రువ్వుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించి వాటిని అడ్డుకున్నారు.

బీజేపీ పోలింగ్ ఏజెంట్ పాలి జిల్లాలో గుండెపోటుతో మరణించాడు. శాంతి లాల్ అనే వ్యక్తి సుమెర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో పోలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద లాల్ కుప్పకూలాడని, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటు కారణంగా అనుమానాస్పదంగా భావించిన వైద్యులు అతను చేరుకున్న తర్వాత మరణించినట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగగా, శ్రీగంగానగర్‌లోని కరణ్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
రాజస్తాన్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో పలు చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈసీ కూడా వెంటనే స్పందించి పోలీసులను అక్కడికి పంపి వాటిని అడ్డుకుంటోంది. సాయంత్రం 6 గంటలతో రాష్ట్రంలో పోలింగ్ ముగియనుంది. అప్పటివరకూ క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే హక్కు కల్పిస్తారు.












Click it and Unblock the Notifications