రాజస్తాన్ ఎన్నికలు-కాంగ్రెస్ గ్యారంటీలపై చర్చ-వసుంధరా రాజేకు గెహ్లాట్ సవాల్..
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం తర్వాత ఆ పార్టీ ఇస్తున్న గ్యారంటీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈనెలలో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. విపక్షాలు వీటిని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలపై బీజేపీ చేస్తున్న విమర్శలపై స్పందించించిన సీఎం అశోక్ గెహ్లాట్ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే సింధియాకు సీఎం అశోక్ గెహ్లాట్ ఇవాళ సవాల్ విసిరారు. తమ గ్యారంటీలపై చర్చకు రావాలని ఆమెను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏడు గ్యారంటీల విషయంలో తాము సీరియస్ గా ఉన్నామని గెహ్లాట్ తెలిపారు. రాజస్తాన్ ఎన్నికల్లో ఇప్పుడు అదే ప్రధానాంశమని సీఎం పేర్కొన్నారు.

రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏడు గ్యారంటీలపై తనతో చర్చకు రావాలని వసుంధరా రాజే సింధియాకు అశోక్ గెహ్లాట్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో వీటిపైనే అసలు పోరు జరగబోతోందని ఆమెను ఉద్దేశించి తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వీటిని కర్నాటక తరహాలోనే తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు ఈ నెల 25న ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications