Rajasthan Polls: వరల్డ్ కప్ ఓటమికి కారణం మోడీయే-రాజస్తాన్ ప్రచారంలో రాహుల్..

భారత్ తాజాగా జరిగి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పడుతున్నాయి. అదే సమయంలో బీజేపీ ప్రత్యర్ధులు కూడా ఆ పార్టీతో పాటు ప్రధాని మోడీని ఆడుకుంటున్నారు. ప్రధాని మోడీ అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లడం వల్లే భారత్ ఓడిపోయిందంటూ సోషల్ మీడియాలో విపక్ష పార్టీలు ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలోకి తెచ్చేశారు.

రాజస్తాన్ లోని జాలోర్ లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. వరల్డ్ కప్ ఫైనల్ ప్రస్తావన తెచ్చారు. యువతను ఉత్సాహపరుస్తూ వరల్డ్ కప్ ఫైనల్లో మనోళ్లు (టీమిండియా) గెలిచే వాళ్లే కానీ.. చివర్లో దుష్టశక్తి రావడం వల్లే ఓడిపోయారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తద్వారా ప్రధాని మోడీ ఫైనల్ మ్యాచ్ జరిగే స్డేడియానికి వెళ్లకుండా ఉండాల్సిందంటూ రాహుల్ తెలిపారు.

Rajasthan Polls: rahul gandhi blames pm modis entry for team india lose 2023 world cup final

మరోవైపు గతంలో తన ప్రసంగాల్లో ఓబీసీని అని చెప్పుకున్న ప్రధాని మోడీ.. వారి అభివృద్ధికి మాత్రం ఏమీ చేయలేదని జాలోర్ ర్యాలీలో రాహుల్ గాంధీ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఓబీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేయిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇవాల తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులోనూ ప్రధానాంశం ఇదే.

'జన్ ఘోషణ పాత్ర' పేరుతో ఏడు గ్యారంటీలతో విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ కు అధికారమిస్తే సంక్షేమంతో పాటు కులగణన చేయిస్తామని హామీ ఇచ్చింది. ఈ నెల 25న రాజస్దాన్ లోని 200 అసెంబ్లీ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+