• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం: రేప్ బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. చావు బతుకుల్లో ఆ మహిళ...

|

అత్యాచార కేసుల్లో బెయిల్‌పై బయటకొస్తున్న నిందితులు బాధితులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ అత్యాచార నిందితుడు బాధితురాలి తండ్రిని గన్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్తాన్‌లోని హనుమాన్‌గర్ జిల్లాలోనూ ఇదే ఘటన చోటు చేసుకుంది. అత్యాచార కేసులో బెయిల్‌పై విడుదలైన ఓ నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

అసలేం జరిగింది....

అసలేం జరిగింది....


వివరాల్లోకి వెళ్తే... హనుమాన్‌గర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(30) స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు వివాహం అయినప్పటికీ భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటినుంచి ఆమె తన నానమ్మతో కలిసి ఉంటోంది. ఇదే క్రమంలో స్థానికుడైన ప్రదీప్ బిష్ణోయ్ కన్ను ఆమెపై పడింది. రెండేళ్ల క్రితం అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చాడు.

ఇంట్లోకి చొరబడి... పెట్రోల్ పోసి..

ఇంట్లోకి చొరబడి... పెట్రోల్ పోసి..


తనపై కేసు పెట్టిందన్న కక్షతో ప్రదీప్ బిష్ణోయ్ ఆమెను హత్య చేయాలనుకున్నాడు. గురువారం(మార్చి 4) ఆమె ఇంటి కాంపౌండ్ గోడ దూకి లోపలికి చొరబడ్డ ప్రదీప్... వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. ఆపై క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యాడు. బిష్ణోయ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని బికనీర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరం 90శాతం కాలిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.ఘటనపై బాధితురాలి నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని... ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని ఐజీపీ కుమార్ తెలిపారు.

ఇటీవల యూపీలోనూ... ఆగని నేరాలు....

ఇటీవల యూపీలోనూ... ఆగని నేరాలు....

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో హత్రాస్‌కు చెందిన ఓ యువతిపై గౌరవ్ శర్మ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిపై బాధితురాలు కేసు పెట్టడంతో జైలుకెళ్లక తప్పలేదు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన గౌరవ్ శర్మ... బాధితురాలిపై కక్షతో ఆమె తండ్రిని గన్‌తో కాల్చి చంపాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలు బోరున విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే యూపీలో ఉన్నావ్ అత్యాచార ఘటనలోనూ ఇదే జరిగింది. బెయిల్‌పై బయటకొచ్చిన నిందితుడు బాధితురాలిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు మరింత పెచ్చుమీరుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

English summary
Aman, accused of raping a woman, set the victim on fire after he was released on bail. The incident took place in Hanumangarh district of Rajasthan.The victim sustained 90 per cent burn injuries and was rushed to a government hospital in Bikaner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X