రాజస్థాన్ విద్యాశాఖ ఘోర తప్పిదం: తిలక్ తీవ్రవాదులకు పితామహుడు
జైపూర్: స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్‌పై రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో ఘోరమైన తప్పిదం చోటు చేసుకొంది. లోకమాన్య బాల గంగాధర్ తిలక్‌ను తీవ్రవాదుల పితామహుడుగా వర్ణించారు. ఈ వ్యవహరంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేలరేగాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా పనిచేసే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల కోసం మధురకు చెందిన ఓ ప్రింటర్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇందులోని పాఠాలు తప్పుల తడకగా ఉండడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తిలక్‌ను తీవ్ర వాదులకు పితామహుడిగా పేర్కొన్నారు.

ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలోని 22వ చాప్టర్‌లో 18, 19వ శతాబ్దాల్లో జాతీయ ఉద్యమ పరిణామాలు అనే ఓ పాఠం ఉంది. ఇందులోని అనుబంధ అంశాల్లో తిలక్ గురించి కూడా రాశారు. 267వ పేజీలో ఉన్న ఈ పాఠంలో జాతీయ ఉద్యమానికి తిలక్ దిక్సూచిగా నిలిచారు. అందుకే ఆయనను తీవ్రవాదులకు తండ్రిగా పిలుస్తారని అని వర్ణించారు.
పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసే ముందు చరిత్రకారులను సంప్రదించాలని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డైరెక్టర్ కైలాశ్ శర్మ చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విటర్లో ఈ విషయమై స్పందించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి సత్వరం స్పందించి సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications