రజనీ పార్టీ పెడతారు, బిజెపితోనే పొత్తు: గురుమూర్తి

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జయలలిత మృతి తర్వాత చోటుచేసుకొన్న రాజకీయశూన్యతను భర్తిచేసేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరైన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త రజనీకాంత్.

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో జయలలిత మృతి తర్వాత చోటుచేసుకొన్న రాజకీయశూన్యతను భర్తిచేసేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరైన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త రజనీకాంత్ సన్నిహితుడు గురుమూర్తి అభిప్రాయపడ్డారు.

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గురుమూర్తి మాస్టర్‌మైండ్‌గా పేరొంది. తన అంచనాప్రకారంగా రజనీకాంత్ పార్టీని ఏర్పాటుచేస్తున్నారని ఆయన ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న శూన్యతను భర్తీచేసేందుకు రజనీకాంత్ పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Rajinikanth and BJP Can Change Face of Tamil Nadu Politics, Says RSS Ideologue Gurumurthy

రజనీకాంత్‌కు తన లోపాలోమిటో తెలుసునని చెప్పారు. మోడీతో ఆయన చేతులు కలపడం నిజంగా అధ్బుతమన్నారు. ద్రవిడ రాజకీయాలతో ముందుకుసాగుతున్న తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చనుందన్నారు.

బిజెపితో రజనీకాంత్ చేతులు కలుపుతారని గురుమూర్తి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలానికి దారితీస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో ద్రవిడ రహితంగా మార్చేందుకు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఉపయోగపడుతోందన్నారు.

ఇప్పటికే తమిళ రాజకీయాలు కొంతమేరకు ద్రవిడ రహితంగా మారిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+