రాజకీయాల దిశగా రజనీకాంత్ మరో అడుగు: రూ.కోటి సాయం

రాష్ట్రంలో రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు.

చెన్నై: రాష్ట్రంలో రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్ ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు.

ఆయన ఆధ్వర్యంలోనే ఢిల్లీలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని చెబుతూ వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానన్నారు.

Rajinikanth meets farmers, assures support for linking rivers and pledges ₹1 crore

కాగా, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు.

రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. అయితే రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+