హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేస్తున్నారో చూడండి, ప్రజల ఆశ్చర్యం, సజీవదహనం!

Posted By:
Subscribe to Oneindia Telugu
  అగ్నిప్రమాదం విషయంలో రజనీకాంత్ మాట్లాడలేదు

  చెన్నై/న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయా పర్వతాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులతో కలిసి శనివారం హిమాలయా పర్వతాలకు వెళ్లిన సూపర్ స్టార్ అక్కడ ప్రత్యేక పూజలు, ధ్యానం చేస్తున్నారు. తేనీ జిల్లాలో 10 మంది సజీవదహనం అయిన విషయంలో రజనీకాంత్ తీరుపై తమిళ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  గుర్రం మీద రజనీకాంత్

  గుర్రం మీద రజనీకాంత్

  రజనీకాంత్ హిమాలయాల్లోని ఆయనకు ఎంతో ఇష్టం అయిన బాబాజీ గుహల దగ్గరకు గుర్రం మీద వెళ్లారు. రజనీకాంత్ వెంట వెళ్లిన ఆయన సన్నిహితులు గుర్రాల మీదనే బాబాజీ గుహల దగ్గరకు చేరుకున్నారు.

  రజనీకి బాబాలు స్వాగతం

  రజనీకి బాబాలు స్వాగతం

  తెల్లటి దస్తులు వేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు బాబాజీ గుహల్లోని సన్యాసులు స్వాగతం పలికారు. తరువాత గుహల్లోని బాబాజీ విగ్రహానికి రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. బాబాజీ గుహల్లోనే రజనీకాంత్ ఉన్నారు.

  సూపర్ స్టార్ ధ్యానం

  సూపర్ స్టార్ ధ్యానం

  హిమాలయాల్లోని బాబాజీ గుహల్లో రజనీకాంత్ ఏకాంతంగా ధ్యానం చేస్తున్నారు. రజనీకాంత్ వెంట వెళ్లిన ఆయన సన్నిహితులు వేర్వేరుగా ఏకాంతంగా బాబాజీ గుహల్లో ధన్యానం చేస్తున్నారని తమిళ మీడియా మంగళవారం తెలిపింది.

  తేనీ అగ్నిప్రమాదం

  తేనీ అగ్నిప్రమాదం

  మంగళవారం హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ను జాతీయ మీడియా కలిసింది. తమిళనాడులోని తేనీ జిల్లాలోని కురంగణి పర్వతాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది సజీవదహనం అయిన విషయంలో రజనీకాంత్ మాట్లాడుతారని మీడియా భావించింది.

  రజనీకాంత్ నోట ఒక్క మాట!

  రజనీకాంత్ నోట ఒక్క మాట!

  రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న రజనీకాంత్ తేనీ జిల్లా ఘటనపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం, 10 మంది సజీవదహనం అయినా ఆయన విచారం వ్యక్తం చెయ్యకపోవడంతో తమిళ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తేనీ జిల్లా ఘటన గురించి రజనీకాంత్ కు తెలియదా ? తెలిసినా ఎందుకు మాట్లాడలేదు ? అని ఇప్పుడు తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rajinikanth who is on spiritual pilgrimage to the Himalayas, not talk about the Theni wild fire accident.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి