సందేహమెందుకు? రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం: ఆత్మీయ మిత్రుడు మణియన్
సందేహమెందుకు? రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ప్రముఖ రాజకీయ వేత్త, రచయిత, రజనీకాంత్ ఆత్మీయ మిత్రుడు మణియన్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
చెన్నై: సందేహమెందుకు? రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అని ప్రముఖ రాజకీయ వేత్త, రచయిత, రజనీకాంత్ ఆత్మీయ మిత్రుడు మణియన్ శుక్రవారం వ్యాఖ్యానించారు.
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం మణియన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. దాదాపు 90 నిమిషాల ఈ భేటీలో తన రాజకీయ ప్రవేశంపైనే రజనీ ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే మణియన్ మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే రజనీకాంత్ తన అభిమానులతో భేటీ అవుతారని, ఆ సందర్భంలోనే తన రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 26 నుంచి 31 మధ్యలో ఏ రోజయినా రజనీ ప్రకటన చేయొచ్చని మణియన్ వ్యాఖ్యానించారు.
రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రజనీకాంత్ కచ్చితంగా ప్రజాసేవలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రజనీకాంత్ వల్ల రాష్ట్రానికీ, దేశానికీ మంచే జరుగుతుందని మణియన్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రజనీకాంత్ ఈ నెల 26 నుండి 31 వరకు కోడంబాక్కంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో తన అభిమానులతో సమావేశమయ్యే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దీంతో త్వరలోనే రజనీ కొత్త పార్టీ పెట్టేస్తారనే చర్చ ఆయన అభిమానుల్లో మరోసారి మొదలైంది.












Click it and Unblock the Notifications