రాజీవ్ ఒక్కడే, కాంగ్రెస్‌కు మేమే అంత్యక్రియలు చేస్తాం: సుబ్రమణ్యస్వామి సంచలనం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/పాట్నా: కాంగ్రెస్ పార్టీపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సోమవారం మాట్లాడారు.

యూపీ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, తామే అంత్యక్రియలు చేయనున్నామని అన్నారు. మ‌రోవైపు మధ్యవర్తిత్వం ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమవుతుంద‌ని పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబంలో మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి వ్య‌క్తని, ఆయ‌న‌ హిందువులను జాగృత పరచడానికి ఎంతో పాటుప‌డ్డార‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి అన్నారు.

Rajiv Gandhi only good human in Nehru Gandhi family, says Subramanian Swamy

ఆ నాడు కాంగ్రెస్‌ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్ లో ప్రసారం చేయడానికి ఆయ‌న ఒప్పుకున్నార‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం పాట్నాలో ఉన్న సుబ్రమణ్యస్వామి అయోధ్య అంశంపై అక్కడ ప్రసంగించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior BJP leader Subramanian Swamy on Sunday praised Rajiv Gandhi as the only good human being in the Nehru Gandhi family and said that the former prime minister had contributed to awakening of the Hindus.
Please Wait while comments are loading...