టార్గెట్ 350: బీజేవైఎం జాతీయ మహాసభల్లో రాజ్‌నాథ్ పిలుపు, కాంగ్రెస్‌పై నిప్పులు

Recommended Video

    Telangana Elections 2018 : కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ మండిపాటు

    హైదరాబాద్‌: స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో రెండ్రోజులపాటు జరిగే బీజేవైఎం జాతీయ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సభలను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ప్రపంచీకరణ దిశగా యువత అడుగులు వేస్తోందని అన్నారు. స్వశక్తి భారత్‌ నిర్మాణానికి యువత ఉత్సాహం చూపుతోందని పేర్కొన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్ర కీలకమని అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో సురాజ్య ఆకాంక్ష నెరవేరుతోందని అన్నారు. నాలుగేళ్ల మోడీ పాలనలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలపడిందని చెప్పారు. తొలుత దేశం.. తర్వాతే పార్టీ అనేది బీజేపీ నినాదమన్నారు.

    దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని రాజ్‌నాథ్‌ విమర్శించారు. అన్ని పక్షాలు ఒక్కటైనా ప్రధాని మోడీని, బీజేపీని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో వెళ్లే పార్టీలు 'మీటూ' ఉద్యమం చేయాలని ఎద్దేవా చేశారు.

    2019 ఎన్నికల్లో 350 సీట్లు వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ జాతి హితం కన్నా.. రాజకీయ హితమే కోరుకుంటోందని మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ రక్షణను ప్రమాదంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ మహాసభలకు బీజేవైఎం ప్రెసిడెంట్ పూనమ్ మహాజన్, పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

    Rajnath Singh inaugurates at BJYM national meet in Parade Grounds

    కాగా, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీజేపీ యువ మోర్చా జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తరలివచ్చి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మహాసభలకు వచ్చిన ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

    ఈ మహాసభలు నేటి నుంచి రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. దేశం నలుమూలల నుంచి 40 వేల మంది ప్రతినిధులతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

    2019 ఎన్నికల విజయ సూచికంగా హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న మహాసభలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అదే విధంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని తెలంగాణ యువతను ఆకర్షించేందుకు ఈ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+