వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిదే గెలుపు: కాంగ్రెస్‌కు టీడీపీ, ఎన్డీయేకు టీఆర్ఎస్ ఓటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

    రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి విజయం

    న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. గెలుపు ఎన్డీయేకు కాస్త అనుకూలంగా ఉంది. శివసేన మద్దతు బీజేపీకి కొంత ఉత్సాహం ఇచ్చింది. నవీన్ పట్నాయక్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మద్దతు కోరారు. ఎన్డీయే తరఫున హరవంశ్, విపక్షాల తరఫున హరిప్రసాద్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు పార్టీ విప్ వర్తించదు.

    <strong>చదవండి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: టీడీపీ ఊహించని నిర్ణయం, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు</strong>చదవండి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: టీడీపీ ఊహించని నిర్ణయం, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు

    చదవండి: కాంగ్రెస్ మాకు చెప్పిందొకటి చేసిందొకటి, వారికే మద్దతు: రాజ్యసభ ఎన్నికపై విజయసాయి

    Rajya Sabha Deputy Chairman Election LIVE: AAP’s Modi hug jibe at Congress

    Newest First Oldest First
    12:52 PM, 9 Aug

    కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతామని, రాజకీయాల్లో ఇది సహజమేనని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
    12:22 PM, 9 Aug

    1956 జూన్ 30వ తేదీన హరివంశ్ నారాయణ సింగ్ జన్మించారు. ఆయన స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని భలియా. రాంచీలోని బెనారస్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. కొన్నాళ్ల పాటు హైదరాబాదులోని ఆర్బీఐలో పని చేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ మీడియా అడ్వయిజర్‌గా పని చేశారు.
    12:22 PM, 9 Aug

    రాజ్యసభలో 244 మంది సభ్యులు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ, వైసీపీ సహా 14 మంది ఎంపీలు దూరంగా ఉన్నారు. దీంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. ఎన్డీయే అభ్యర్థికి 125 ఓట్లు వచ్చాయి.
    12:11 PM, 9 Aug

    సభను హుందాగా నడిపే సామర్థ్యం హరివంశ్‌కు ఉందని ప్రధాని మోడీ అన్నారు.
    12:03 PM, 9 Aug

    హరివంశ్ మంచి విద్యావంతుడు అని ప్రధాని మోడీ కొనియాడారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
    12:03 PM, 9 Aug

    హరివంశ్‌కు ప్రధాని మోడీతో బాటు జైట్లీ, ఆజాద్ అభినందనలు తెలిపారు.
    11:49 AM, 9 Aug

    ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హరివంశ్ ప్రసాద్‌ను బీజేపీ గెలిపించుకుంది. నితీష్ కూడా పలువురి మద్దతు కూడగట్టారు. డిప్యూటీ చైర్మన్‌గా గెలుపొేందిన హరివంశ్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
    11:45 AM, 9 Aug

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయగా, టీఆర్ఎస్ ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేసింది.
    11:44 AM, 9 Aug

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ గెలుపొందారు. ఆయనకు 125 ఓట్లు వచ్చాయి. ఆయన ఎన్డీయే మిత్రపక్షం జేడీయూ ఎంపీ.
    11:43 AM, 9 Aug

    కాంగ్రెస్ పార్టీ తీరు కారణంగా తాము రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఏఏపీ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు.
    11:17 AM, 9 Aug

    బీజేేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 122 మంది బలం ఉండగా, యూపీఏ అభ్యర్థికి 118 మంది వరకు మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది.
    11:15 AM, 9 Aug

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయింది. ఎన్డీయే తరఫున హరివంశ్, యూపీఏ తరఫున హరిప్రసాద్ బరిలో నిలిచారు. టీడీపీ... యూపీఏ తరఫున నిలబడిన హరిప్రసాద్‌కు మద్దతిస్తోంది. 244 ఎంపీలలో మేజిక్ ఫిగర్ 123.
    11:12 AM, 9 Aug

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తాము ఎన్డీయే తరఫున నిలబడిన జేడీయూ అభ్యర్థి హరివంశ్‌కు మద్దతిస్తామని బీజేడీ తెలిపింది. తమ రెండు పార్టీల భావాలు ఒకటేనని వెల్లడించారు.
    10:52 AM, 9 Aug

    రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మేం గెలుస్తామని గట్టి నమ్మకం ఉందని ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ అన్నారు.
    10:13 AM, 9 Aug

    రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. ఇటు ఎన్డీయే, అటు విపక్షాల అభ్యర్థికి ఓటు వేయవద్దని నిర్ణయించినట్లు ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
    8:42 AM, 9 Aug

    ఎన్డీయే తరఫున జేడీయూ రాజ్యసభ సభ్యులు హరివంశ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతివ్వాలని నితీష్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి కోరారు.
    8:41 AM, 9 Aug

    శివసేన ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించింది.
    8:41 AM, 9 Aug

    తెలుగుదేశం పార్టీ విపక్షాల అభ్యర్థికి (కాంగ్రెస్ అభ్యర్థి)కి మద్దతిస్తోంది.
    8:41 AM, 9 Aug

    245మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీయేకు 90 మంది ఎంపీలు ఉన్నారు. మెజార్టీకి 32 మందికి పైగా ఎంపీలు తక్కువ పడుతున్నారు. టీఆర్ఎస్, అన్నాడీఎంకే వంటి పార్టీలు మద్దతిచ్చే అవకాశముంది.
    8:41 AM, 9 Aug

    విపక్షాలకు 112 మంది ఎంపీల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, టీడీపీ, ఎన్సీపీలు ఉన్నాయి. వీరికి 10 మంది తక్కువగా ఉన్నారు. అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ వంటి పార్టీలకు దాదాపు ముప్పై మంది సభ్యులు ఉన్నారు. వీరు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరం.

    English summary
    NDA Candidate Harivansh Narayan Singh elected as Rajya Sabha Deputy Chairman
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X