సచిన్‌కు దొరికిన లీవ్, ఢిల్లీకొచ్చినా..: ఎంపీల విమర్శలు

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, మాస్ట్ర బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు సోమవారం లీవ్ సాంక్షన్ అయింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సచిన్ సెలవును ఆమోదించారు. ఈ సందర్భంగా కొంతమంది ఎంపీలు సచిన్ పైన విమర్శలు గుప్పించారు. సచిన్ లీవ్ పిటిషన్‌కు ఆమోదం తెలుపుతున్నట్లు కురియన్ చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు ఎంపీలు సచిన్ టెండుల్కర్‌కు లీవ్ సాంక్షన్ చేయడాన్ని ప్రశ్నించారు. సచిన్ ఇటీవల ఢిల్లీకి వచ్చారని, విజ్ఞాన్ భవన్‌కు వెళ్లారని, అయితే రాజ్యసభకు మాత్రం రాలేదని చెప్పారు. ఢిల్లీకి వచ్చి ఎవరైనా సభకు హాజరు కాలేదంటే, వారు సభను అవమానించినట్లేనని సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు.

Rajya Sabha Deputy Chairman grants leave to MP Sachin Tendulkar

తాను సభకు ఎందుకు హాజరు కాలేదో, అలాగే ఢిల్లీకి వచ్చి ఎందుకు రాలేదో సచిన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలువురు ఎంపీలు పలు కారణాలతో సభకు గైర్హాజరవుతుంటారని, దీనిపై తాము అడుగుతామని కురియన్ చెప్పారు. అయితే, సభ్యులు దానిపై అడగవద్దని హితవు పలికారు. అనంతరం సభ సచిన్‌కు లీవ్ ఇచ్చింది.

కాగా, సచిన్ పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై సచిన్ వివరణ ఇచ్చాడు కూడా. ఈ క్రమంలో ఆయన తాజా సమావేశాలకు హాజరు కాలేనని రాజ్యసభ చైర్మన్ కు అభ్యర్థన లేఖ పంపారు. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా తనకు సెలవు మంజూరు చేయాలని లేఖలో కోరారు. పెద్దన్న అజిత్ కు బైపాస్ సర్జరీ కారణంగా తాను సమావేశాలకు హాజరుకాలేకపోయానని సచిన్ ఇంతకుముందు ఓ ప్రకటన చేయడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+