మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు: చిరంజీవి సహా ఏపీ-తెలంగాణల నుంచి 6సీట్లు
న్యూఢిల్లీ: పదహారు రాష్ట్రాలలో 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి మొత్తం 58 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
ఈ మేరకు ఈసీ శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు మార్చి 12 గడువు. మార్చి 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 15వ తేదీ గడువు. మార్చి 23న రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ, తెలంగాణల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో చిరంజీవి, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్‌లు ఉన్నారు.












Click it and Unblock the Notifications