బతకాలని లేదు, ఉరితీయండి: డేరా బాబా షాక్, నేపాల్ పారిపోయిన హనీప్రీత్?
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు ఒంటరి జీవితం గడుపుతూ బాధగా ఉంటున్నాడట.
ఢిల్లీ: ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న డేరా సచ్ఛా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు ఒంటరి జీవితం గడుపుతూ బాధగా ఉంటున్నాడట. ఈ మేరకు వేరే కేసులో శిక్ష అనుభవిస్తూ గుర్మీత్ సింగ్ జైలులోనే ఉండి బెయిల్ పై విడుదలైన ఓ ఖైదీ వెల్లడించాడు.

నిద్రలేని రాత్రి..
ఈ సందర్భంగా విడుదైలన ఆ ఖైదీ మీడియాతో మాట్లాడుతూ.. జైలుకు వచ్చిన రోజు రాత్రంతా నిద్రపోకుండా తాను చేసిన తప్పేంటని, ఈ శిక్ష ఎందుకు విధించారు దేవుడా? అని గుర్మీత్ బాధపడిపోయాడని చెప్పాడు.
Recommended Video


ఉరితీయండి..
అంతేగాక, తనను ఉరితీయాలని, తనకు బతకాలని లేదని గుర్మీత్ బాబా వేడుకున్నాడని తెలిపాడు. అలాగే, గుర్మీత్ బాబాను మిగితా సాధారణ ఖైదీల్లాగే చూస్తున్నారని, ఆయనకు ఎలాంటి వీఐపీ సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పాడు. ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్ ను దోషిగా తేల్చిన కోర్టు 20ఏళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే.

పరారీలో దత్త పుత్రిక హనీప్రీత్
గుర్మీత్‌కు జైలు శిక్ష పడిన తర్వాత అతడ్ని తప్పించేందుకు కుట్ర పన్నారన్న అభియోగాల మేరకు గుర్మీత్ దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె పరారీలో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

నేపాల్ పోరిపోయిందా...?
హనీప్రీత్ ఆచూకీ కనిపించడం లేదని పంచకుల డీసీపీ మన్బీర్ సింగ్ స్పష్టం చేశాడు. ఆమె నేపాల్ పారిపోయి ఉంటుందన్న అనుమానంతో ఆమె ఆచూకీ కోసం ఓ పోలీసు బృందాన్ని ఇండో-నేపాల్ సరిహద్దుకు పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications