ప్రధాని మోడీ మాట, చైనా గూడ్స్ రెండు ఒక్కటే, గ్యారెంటీ లేదు, వారెంటీ లేదు, రామలింగా రెడ్డి ఫైర్!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ మీద కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి విరుచుకుపడ్డారు. అపద్దాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోడీ దిట్ట అని, ఆ విషయంలో ఆయనకు నోబుల్ బహుమతి ఇవ్వాలని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మాటకు చైనా గూడ్స్ కు ఎక్కడా విలువలేదని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు. శనివారం బెంగళూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడిన హోం మంత్రి రామలింగా రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు.

బెంగళూరు క్రైం సిటి
ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు క్రైం సిటి అని, నలపాడ్ గ్యాంగ్ దాడులు చేసిందని ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్ సీఆర్ బీ నివేదికలు చెబుతున్నాయని హోం మంత్రి రామలింగా రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యేలు రేప్ చేస్తున్నారు
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే బాలిక మీద అత్యాచారం చేసిన విషయం మీకు కనపడలేదా అని ప్రధాని మోడీని హోం మంత్రి రామలింగా రెడ్డి ప్రశ్నించారు. అనేక మంది బీజేపీ ఎంపీల మీద మహిళలపై దౌర్జన్యాలు చేశారని కేసులు నమోదు అయ్యాయని రామలింగా రెడ్డి ఆరోపించారు.

ఎక్కడ అవినీతి
కర్ణాటక ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడిన రామలింగా రెడ్డి గుజరాత్ కు మూడు సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ లోకాయుక్తను ఎందుకు నియమించలేదని, మీ అవినీతి బయటపడుతుందని నియమించలేదని ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు.

పెట్రోల్, గ్యాస్ ధరలు
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నిసార్లు పెట్రోల్, డీసెల్, గ్యాస్ ధరలు పెరిగాయని బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్పాలని హోం మంత్రి రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు.

మోడీ మాట చైన్ గూడ్స్
ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు, చైనా గూడ్స్ కు తేడా లేదని హోం మంత్రి రామలింగా రెడ్డి ఎద్దేవ చేశారు. చైనా గూడ్స్ ఒక్క సారి తీసుకున్న తరువాత గ్యారెంటీ ఉండదని, వారెంటీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అంతేనని రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications