Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown: స్కెచ్ లు 18, రూ. 25 లక్షల ఆధాయం, అశోకుడి మాస్టర్ ప్లాన్, ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది

బెంగళూరు/ రామనగర: కరోనా వైరస్ (COVID 19) దెబ్బతో మార్చి 25వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో సామాన్య ప్రజలు, వలస కూలీలు, కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. లక్షల మంది వలస కూలీలు, కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పోయి గంజితాగి బతుకులు వెళ్లదీస్తున్నారు. అయితే ఓ యువకుడు తన తెలివితేటలతో 18 రోజులు కష్టపడి రూ. 25 లక్షలు సంపాధించుకున్నాడు. అయితే చేసిన పాపం ఊరికేపోదనే సామతె అతనికి గుర్తుకు వచ్చింది. ఎలాగైతే సంపాధించాడో అలాగే అతని సంపాధన చేరవలసి చోటకే చేరిపోయింది.

 కోటీశ్వరుడు అయిపోవాలి

కోటీశ్వరుడు అయిపోవాలి

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణంలో ఉదయ్ కుమార్ అలియాస్ అశోక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అశోక్ చాలా తెలివైన వాడు. ఎలాంటి కష్టం లేకుండా తను కోటీశ్వరు అయిపోవాలని కలలు కంటున్నాడు. కోటీశ్వరు కాకపోయినా పర్వాలేదు కనీసం లక్షాధికారి అయిపోవాలని అశోక్ ప్లానే వేశాడు.

 అశోకుడి చేతివాటం అదుర్స్

అశోకుడి చేతివాటం అదుర్స్

లాక్ డౌన్ అమలులోకి రాకముందే చాలా మంది వారి ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లిపోయారు. లాక్ డౌన్ దెబ్బతో కోట్లాది మంది ప్రజలు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. అయితే అశోక్ మాత్రం తన తెలివితేటలు ఉపయోగించి ఇదే మంచి చాన్స్ అంటూ తన చేతివాటం చూపించాడు.

 18 స్కెచ్ లు.... రూ. 25 లక్షలు ఆధాయం

18 స్కెచ్ లు.... రూ. 25 లక్షలు ఆధాయం

లాక్ డౌన్ సందర్బంగా అనేక ప్రాంతాల్లో సంచరించిన అశోక్ ఎవరెవరు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లిపోయారు ?, ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ?, ఏ ఇంటికి కన్నం వేస్తే ఎంత లాభం వస్తుంది ? అని ఆరా తీశాడు. అంతే 18 ఇళ్లకు కన్నం వేసిన అశోక్ రూ. 25 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు లూటీ చేశాడు.

 ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది నాయనా !

ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది నాయనా !

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అశోక్ ను మాగడి పోలీసులు పట్టుకున్నారు. అశోక్ పాత నేరస్తుడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అశోక్ ను పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విసయం బయటకు వచ్చింది. తాను బెంగళూరులో పాటు మాగడి, మండ్య, తుమకూరు తదితర ప్రాంతాల్లో 18 చోట్ల చోరీలు చేశానని అశోక్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Bigg Boss 4 Telugu : మనసు మార్చుకున్న నాగార్జున.. బిగ్ బాస్ 4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్!
     బెయిల్ మీద బయటకు వచ్చి !

    బెయిల్ మీద బయటకు వచ్చి !

    అశోక్ ఇచ్చిన సమాచారం మేరకు 18 ప్రాంతాల్లో చోరీ చేసిన వివరాలు సేకరించి రూ. 25 లక్షల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, విలువైన వస్తులు స్వాధీనం చేసుకున్నారు. 2019లో చోరీ కేసుల్లో అరెస్టు అయిన అశోక్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ చోరీలు చేస్తున్నాడని మాగడి పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+