ప్రచారంతో నటి రమ్యకు గొంతు నొప్పి, విశ్రాంతి
బెంగళూర్: రాజకీయ నేతగా మారిన నటి దివ్య స్పందన అలియాస్ రమ్య విస్తృతమైన ఎన్నికల ప్రచారంతో అస్వస్థతకు గురయ్యారు. ఆమె కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మాండ్యా అంతటా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె పాల్గొంటున్నారు. మాండ్యా అంతటా పర్యటిస్తూ విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు.

ఆమె గొంతు సంబంధమైన సమస్యతో బాధపడుతున్నట్లు, ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఆమె ఒక రోజు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
కర్ణాటకకు చెందిన నటి దివ్య స్పందన అలియాస్ రమ్య దిల్ కా రాజా, నీర్ డోస్, ఆర్యన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆమె షూటింగులో పాల్గొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications