కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!

దారుణ హత్యకు గురైన కాలేజ్ అమ్మాయి నేహా కేవలం నిరంజన్ హిరేమఠ్ కుమార్తె మాత్రమే కాదని, ఆమె మొత్తం కర్ణాటక కుమార్తె అని, కార్పోరేటర్ నిరంజన్ మా కుటుంబ సభ్యుడి లాంటివాడు అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. మీరు ఈ ఇంటి బయటకు వెళ్లి రాజకీయాలు చేయండి అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా పరోక్షంగా కార్పోరేటర్ నిరంజన్ ను ఉద్దేశించి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.

నేహా హత్యపై రణదీప్ సూర్జేవాల చేస్తున్న వ్యాఖ్యలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ నిరంజన్ కు చెందిన హుబ్బళి నివాసానికి వెళ్లిన రణదీప్ సూర్జేవాలా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ హత్య ఘటన పట్ల మేం కూడా చాలా బాధపడ్డామని, చావు ఇంట్లో ఎన్నికల రాజకీయాలు సరికాదని అన్నారు. కాంగ్రెస్‌తో సహా మనమందరం నేహా కుటుంబ సభ్యుకు తోడుగా ఉంటూ వారికి న్యాయం చెయ్యడానికి ప్రయత్నించాలని అన్నారు.

Randeep Singh Surjewala accused BJP leaders of playing politics in Neha s murder case

నేహా కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయడం మా ప్రభుత్వ కర్తవ్యం అని సూర్జేవాల అంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని, త్వరగా న్యాయం జరగాలని, మరో 90 రోజుల్లో నేహా మృతికి న్యాయం జరుగుతుందని రణదీప్ సూర్జేవాల విశ్వాసం వ్యక్తం చేశారు. నేహా హత్య కేసు సీఐడీకి అప్పగించారు. హత్యకేసు నిందితులను ఉరితీయాలి అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక కోర్టు వల్ల కచ్చితంగా త్వరగా న్యాయం జరుగుతుందని సూర్జేవాల అన్నారు.

ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయవద్దని సూర్జేవాల కోరారు. లవ్ జిహాద్ కోణంలో హుబ్బళికి చెడ్డపేరు వస్తుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే నేహా హత్య కేసును సీబీఐతో విచారణ చెయ్యాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు, మాకు సీఐడీపై నమ్మకం ఉందని, రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని, నేహా మృతికి మరో మూడు నెలల్లో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన సూర్జేవాల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+