వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లోపతి వైద్యంపై రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు : ఆ కేసులపై స్టే కోసం సుప్రీం కోర్టుకు యోగా గురువు !!

|
Google Oneindia TeluguNews

అల్లోపతి వైద్యం కరోనా కట్టడిలో విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే అంటూ ఇటీవల యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా వైద్యులను రెచ్చగొట్టిన యోగా గురువు రామ్‌దేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. ఈ అంశంపై తనపై ఉన్న పోలీసు కేసులపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దేశ వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులు ఢిల్లీకి బదిలీ చెయ్యాలని కోరిన రాందేవ్ బాబా

దేశ వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులు ఢిల్లీకి బదిలీ చెయ్యాలని కోరిన రాందేవ్ బాబా


దేశవ్యాప్తంగా దాఖలు చేసిన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని ఆయన కోరారు. గత నెలలో, కోవిడ్ యొక్క రెండవ తరంగం కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో రామ్‌దేవ్ వైరస్‌కు వ్యతిరేకంగా అల్లోపతి మందుల సమర్థతపై తన వ్యాఖ్యలతో వివాదాన్ని రేకెత్తించారు. అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది మరణించారు. చికిత్స జరగక, ఆక్సిజన్ లభించనందున మరణించిన వారి కంటే అల్లోపతి మందుల వల్ల మరణించినవారి సంఖ్య చాలా ఎక్కువ" అని ఆయన పేర్కొన్నారు.

అల్లోపతి మందులపై రామదేవ్ బాబా వ్యాఖ్యలు .. కేసులతో పాటు నోటీసు పంపిన ఐఎంఏ

అల్లోపతి మందులపై రామదేవ్ బాబా వ్యాఖ్యలు .. కేసులతో పాటు నోటీసు పంపిన ఐఎంఏ

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క వివిధ విభాగాలు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ దేశవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. దీని ఆధారంగా రాందేవ్ బాబాపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలకు 15 రోజుల్లో క్షమాపణ చెప్పమని అసోసియేషన్ అతనికి నోటీసు పంపింది. విఫలమైతే, పరువు నష్టం కోసం 1,000 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.

అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న బాబా .. కేసులపై స్టే కోసం కోర్టు మెట్లు ఎక్కిన యోగా గురువు

అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న బాబా .. కేసులపై స్టే కోసం కోర్టు మెట్లు ఎక్కిన యోగా గురువు


రామ్‌దేవ్ అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తో మాట్లాడిన తర్వాత ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత రామ్‌దేవ్ బాబా త్వరలో కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటానని చెప్పాడు. ఇదే సమయంలో వైద్యులను ధరణిపై దైవదూతలు అంటూ అభివర్ణించారు. తాజాగా సుప్రీం కోర్టులో తనపై ఉన్న కేసులపై స్టే కోసం రాందేవ్ బాబా పిటిషన్ దాఖలు చేశారు. అన్ని కేసులు ఒకే చోటికి బదిలీ చెయ్యాలని అంతేకాకుండా కేసులన్నింటిపై స్టే విధించాలని ఆయన సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు .

పాట్నా , రాయపూర్ లలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ల విచారణపై స్టే కోరిన రాందేవ్ బాబా

పాట్నా , రాయపూర్ లలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ల విచారణపై స్టే కోరిన రాందేవ్ బాబా

పాట్నా, రాయ్‌పూర్ శాఖల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణను నిలిపివేయాలని బాబా రామ్‌దేవ్ తన పిటిషన్‌లో కోరారు. ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు.కోవిడ్ -19 చికిత్స కోసం వాడుతున్న మందుల గురించి "తప్పుడు" సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చత్తీస్ గడ్ , రాయ్‌పూర్‌లో పోలీసులు బాబా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) యొక్క ఛత్తీస్‌ గడ్ యూనిట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్‌కృష్ణ యాదవ్ అలియాస్ బాబా రామ్‌దేవ్‌పై కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ యాదవ్ తెలిపారు. బాబా రామ్‌దేవ్‌పై ఐపిసి సెక్షన్ 188 , 269 , 504 కింద కేసు నమోదు చేశారు.

English summary
Yoga guru Baba Ramdev has moved the Supreme Court seeking a stay of the proceedings in multiple FIRs lodged against him in various states over his remarks on allopathy in which he criticised doctors over the treatment method for Covid-19 cases. Baba Ramdev in his petition has sought a stay on the proceedings in FIRs lodged by Indian Medical Association (IMA) in Patna and Raipur branches and asked for a transfer of the FIRs to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X