Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరచేతిపై వైద్యురాలి సూసైడ్ నోట్.. 'ఆ పోలీస్ నాపై 4 సార్లు' ..!

మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ అధికం అవుతూనే ఉన్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మృగాళ్లా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇటీవల ఏపీలో 13 ఏళ్ల చిన్నారిపై తాత వయసున్న ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన చూశాం. తాజాగా చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ హద్దు మీరాడు. ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వైద్యురాలిపై ఏకంగా నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఆ మహిళా డాక్టర్ తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మహారాష్ట్రలోని సతరా జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. మహిళల్ని, చిన్నారుల్ని కాపాడాల్సిన పోలీసులే వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ మహిళా వైద్యురాలిని స్థానిక ఎస్సై గోపాల్ బడ్నే వేధించసాగాడు. ఆమెపై గత ఐదు నెలలుగా నాలుగుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ ఎస్సైతో పాటు తోటి పోలీసుల నుంచి కూడా ఆమెకు వేధింపులు వచ్చాయి. దీంతో మనస్తాపానికి లోనైన ఆ వైద్యురాలి తన అరచేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఎస్సై గోపాల్ బడ్నేను సస్పెండ్ చేసి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.

" పోలీస్ అధికారి గోపాల్ బడ్నే నా చావుకి కారణం. అతడు నాపై 4 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఐదు నెలలుగా నన్ను మానసికంగా.. శారీరకంగా వేధించాడు" అని వైద్యురాలు తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుంది. ఫాల్తాన్ సబ్- డిస్ట్రిక్ట్ లోని ఆస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆ వైద్యురాలు.. ఈ ఏడాది జూన్ లోనే పోలీస్ అధికారులపై డీఎస్పీ కార్యాలయానికి లేఖ పంపింది. ఫాల్తాన్ రూరల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులు తనను వేధిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. ఆ లేఖలో గోపాల్ బడ్నే, పాటిల్, లాడ్ పుత్రే పేర్లను పేర్కొంది.

Raped Four Times by Cop Maharashtra Doctor s Palm Bears Chilling Suicide Note in Satara Horror

అయితే తాజాగా సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో గోపాల్ బడ్నేను సస్పెండ్ చేసినట్లు సతారా పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వైద్యురాలి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. ఇదే ఘటనపై రాజకీయపార్టీలు ఒకర్నొకరు దూషించుకుంటున్నాయి. మరోవైపు ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించనున్నట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలి చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల్ని పట్టుకునేందుకు ఇప్పటికే స్పషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+