హ్యాట్సాఫ్ : పూరీ రథయాత్రకు అనుమతి లభించిందంటే ఈ ముస్లిం యువకుడే కారణం.!
పూరీ జగన్నాథ రథయాత్ర అంటే ఒడిషాలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పండగ. ప్రతి ఏటా కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. కానీ మాయదారి మహమ్మారి కరోనా ఈ యాత్ర శోభకు బ్రేక్ వేసింది. ఎంతో మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో ఈ సారి 500 మంది మాత్రమే కనిపించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రథయాత్రకు బ్రేక్ వేయాలంటూ ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది. దీంతో ధర్మాసనం రథయాత్రకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ సారి మాత్రం కొన్ని నిబంధలతో రథయాత్ర వేడుక నిర్వహించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేసింది ఒక ముస్లిం యువకుడు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.

సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన అఫ్తాబ్
ప్రపంచవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్రకు మంచి గుర్తింపు ఉంది. కోవిడ్ -19 కారణంగా రథయాత్ర నిర్వహించరాదని సుప్రీంకోర్టు ముందుగా తీర్పునిచ్చింది. అయితే ఈ రథయాత్ర జరిగేలా మునపటి తీర్పుపై పునఃసమీక్షించాలంటూ అఫ్తాబ్ హుస్సేన్ అనే 19 ఏళ్ల ముస్లిం యువకుడు సుప్రీం తలపులు తట్టాడు. ఒడిషాలోని నయాగడ్‌కు చెందిన వాడు అఫ్తాబ్. ప్రస్తుతం అఫ్తాబ్ పేరు రాష్ట్రంలో మారుమోగుతోంది. అతన్ని రెండో సలాబేగాగా అక్కడి ప్రజలు పిలచుకుంటున్నారు. జగన్నాథుడిపై తనకున్న ప్రేమ ఇలా చాటాడని ఒడిషా ప్రజలు చర్చించుకుంటున్నారు.

రెండో సలాబేగ్గా గుర్తింపు పొందిన అఫ్తాబ్
జూన్ 18న జగన్నాథ రథయాత్ర నిర్వహించరాదని అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీనిపై ముందుగా రియాక్ట్ అయ్యింది ఈ ముస్లిం యువకుడు అఫ్తాబ్ కావడం విశేషం. తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. బీఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అఫ్తాబ్‌ను అక్కడి ప్రజలు రెండో సలాబేగాగ గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ సలాబేగా ఎవరు..? మొఘల్ సుబేదార్ కుమారుడే సలాబేగ్. ఒడిషా కవుల్లో ఇతనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంటే ముస్లిం అయినప్పటికీ జగన్నాథుడి కోసం అతని జీవితాన్ని అంకితం చేశాడు.
Recommended Video

సలాబేగ్ సమాధి ముందు కాసేపు ఆగనున్న రథయాత్ర
17వ శతాబ్దం తొలి అర్థభాగంలో సలాబేగ్ జీవించినట్లు చరిత్ర చెబుతోంది. కట్ చేస్తే మూడు కిలో మీటర్లు పాటు సాగే జగన్నాథుడి రథయాత్ర గ్రాండ్ రోడ్‌లోని సలాబేగ సమాధి దగ్గరకు రాగానే గౌరవార్థం కాసేపు ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత రథయాత్రి తిరిగి ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే జగన్నాథుడు తన జీవితంపై ప్రభావం చూపించాడని తన తాత ముల్తాబ్ ఖాన్ కూడా జగన్నాథుడి భక్తుడే అని పిటిషన్ దాఖలు చేసిన అఫ్తాబ్ చెప్పాడు. అఫ్తాబ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాక మరో 15 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 1960లో తన తాత బ్రహ్మ విష్ణు, మహేశ్వర త్రినాథుడి ఆలయాన్ని ఇతామతిలో నిర్మించారని గుర్తు చేశాడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications