వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్బీ స్కాం: విదేశాల్లోని 35 ప్రభుత్వ బ్యాంకుల బ్రాంచీల మూసివేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB-Nirav Modi Fraud : CBI Recovered Documents

న్యూఢిల్లీ: విదేశాల్లోని 35 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచీలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటు చేసుకొన్న కుంభకోణం నేపథ్యంలో తాజగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

విదేశాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేబ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, అలహబాద్ బ్యాంకులు ప్రముఖ నగల వ్యాపారి నీరవ్ మోడీకి రుణాలను ఇచ్చాయి.

Rattled by PNB Scam, Modi Govt Orders Closure of 35 Overseas Branches of PSBs

విదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వరంగానికి చెందిన 35 బ్రాంచీలను మూసివేయాలని బ్యాంకింగ్ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించినట్టు రిపోర్ట్‌లు వెలువడ్డాయి.వీటితో పాటు విదేశాల్లో కొనసాగుతున్న సుమారు 69 ప్రభుత్వరంగ బ్యాంకుల బ్రాంచీల మూసివేసే అంశాన్ని కూడ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

విదేశాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ లాభాలను ఆర్జిస్తున్న బ్యాంకులను మూసివేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలోనే నలుగురైదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించింది. విదేశాల్లోని తక్కువ లాభాలను ఆర్జిస్తున్న బ్యాంకులను మూసివేయాలని సూచించింది. ఈ సూచన మేరకు కేంద్రం నిర్ణయం తీసుకొంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాల్లో సుమారు 90 శాతం రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ70వేల కోట్ల రూపాయాలను సమీకరించాలని నిర్ణయం తీసుకొంది. 2017 అక్టోబర్ మాసంలో రూ.2.11 లక్షల కోట్లతో రీ క్యాపిటలైజేషన్ పథకాన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

English summary
Rattled by the over Rs 11,000 crore Punjab National Bank (PNB) scam, the Narendra Modi government has ordered the closing of 35 overseas branches of public sector banks (PSBs) as the latter’s role in the country’s banking fraud continues to stay under the spotlight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X