దారుణం: జడేజా సతీమణి రీవాపై పోలీస్ కానిస్టేబుల్ దాడి, జుట్టుపట్టి ఈడ్చాడు
Recommended Video

జామ్‌నగర్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై ఓ పోలీసు దాడి చేశాడు. ఆమె నడుపుతున్న కారు.. అదుపుతప్పి అతని బైక్‌ను ఢీకొట్టడంతో కోపోద్రిక్తుడైన పోలీసులు.. ఆమెపై దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో చోటు చేసుకుంది.
రీవాపై దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు జామ్‌నగర్ ఎస్పీ ప్రదీప్ సెజుల్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రీవాపై దాడి చేసిన కానిస్టేబుల్ సజయ్ అహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

జామ్‌నగర్‌లోని సరు సెక్షన్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. కానిస్టేబుల్ బైక్‌ను కారు అదుపుతప్పి ఢీకొనగానే.. ఆ పోలీస్ కానిస్టేబుల్.. రీవాపై దాడికి పాల్పడ్డాడని చెప్పారు.
జుట్టుపట్టి ఈడ్చి ఆమెపై దారుణంగా చేయి చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
బాధ్యతయుమైన పోలీసు విభాగంలో పనిచేస్తూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా ప్రవర్తించడంపై సదరు పోలీసుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications