రూ.2000 నోటుపై ఆర్బీఐ తాజా ప్రకటన- బ్యాంకులకు పరుగులు తీయొద్దని సలహా...
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. అప్పటి నుంచి గతంలో నోట్ల రద్దు సమయంలో చేసినట్లుగానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో వెంటనే డిపాజిట్ చేసేందుకు ఖాతాదారులు పరుగులు తీస్తున్నారు.దీంతో బ్యాంకుల్లో రద్దీ పెరిగిపోతోంది. అలాగే పెట్రోల్ బ్యాంకులు, ఇతర వ్యాపార సముదాయాల్లో రూ.2 వేల నోట్లను తీసుకునేందుకు ఇప్పటికే నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది.
బ్యాంకు ఖాతాదారులు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా మార్చుకోవడానికి పరుగులు తీస్తుండటంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ స్పందించారు. ఖాతాదారులు నోట్లను బ్యాంకుల్లో వెంటనే డిపాజిట్ చేసేందుకు తొందరపడవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ప్రజలు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు తాము ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30కు ఒక్క రోజు ముందు వరకూ ఇవి చెల్లుతాయని పేర్కొన్నారు.

బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు డిపాజిట్ చేసేందుకు తాము ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30 అని మరోసారి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గుర్తుచేశారు. అప్పటి వరకూ మార్కెట్లో ఈ నోట్లు చెల్లుతాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆయన తెలిపారు. కాబట్టి ఇప్పుడు జనం బ్యాంకుల వద్దకు పరుగులు తీయడంలో అర్ధం లేదన్నారు. మీకు బ్యాంకుల్లో ఈ నోట్ల డిపాజిట్ కు నాలుగు నెలల సమయం ఇచ్చామన్నారు.
ఎలాగో తాము రూ.2 వేల నోట్ల డిపాజిట్ కు గడువు క్లియర్ గానే ఇచ్చినందున ప్రజలు దీన్ని మాత్రమే సీరియస్ గా తీసుకోవాలని, భయపడి ఇప్పుడే డిపాజిట్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. గతంలో నోట్ల రద్దు చేసిన తర్వాత పరిస్ధితులకు అనుగుణంగా రూ.2 వేల నోటును తీసుకొచ్చామని, ఇప్పుడు దాని అవసరం తీరిపోయినందున తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు రేపటి నుండి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications