వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ గవర్నర్ నెల జీతం ఎంతంటే..: ఉర్జీత్ కంటే రఘురాం సౌకర్యాలు ఎక్కువ

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాలు రూ.2 లక్షలు. అతనికి వ్యక్తిగత సహాయకులు ఎవరు కూడా లేరు.

|
Google Oneindia TeluguNews

ముంబై: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జీత్ పటేల్ నెల జీతం అక్షరాలు రూ.2 లక్షలు. అతనికి వ్యక్తిగత సహాయకులు ఎవరు కూడా లేరు. రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్లు మాత్రమం ఆయనకు ఉన్నారు. గతంలో పని చేసిన రఘురాం రాజన్, ప్రస్తుత గవర్నర్ ఉర్జీత్‌లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.

రానున్న కొత్త రూ.20, రూ.50 నోట్లు, పాతవి చెల్లుతాయిరానున్న కొత్త రూ.20, రూ.50 నోట్లు, పాతవి చెల్లుతాయి

సెప్టెంబర్‌ ఆరో తేదీన గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన ఉర్జీత్ పటేల్‌ అక్టోబర్‌ నెల వేతనంగా రూ.2.09లక్షలు అందుకున్నట్లు వెల్లడించింది. 2013 సెప్టెంబర్‌ 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన తొలి వేతనంగా రూ.1.69లక్షలుగా పేర్కొంది.

2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతాన్ని రూ.1.78లక్షలకు, ఆ తర్వాత రూ.1.87 లక్షలకు చొప్పున రెండుసార్లు సవరించినట్లు పేర్కొన్నారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో నెల వేతనాన్ని 2.09లక్షలకు పెంచారు.

urjit patel

ఇతర సదుపాయాల విషయంలో ఉర్జిత్ పటేల్‌ కంటే రఘురాం రాజన్‌ ఎక్కువ సౌకర్యాలను పొందారు. ఆర్బీఐ అందించిన బంగ్లాతో పాటు మూడు కార్లు, నలుగురు డ్రైవర్లు, ఒక వ్యక్తిగత సంరక్షుడితో పాటు, తొమ్మిది మంది సహాయకులుగా ఆయనకు వ్యవహరించేవారని ఆర్బీఐ పేర్కొంది.

సెప్టెంబర్ 4వ తేదీ వరకు పని చేసిన రఘురాం రాజన్‌కు ఆ నాలుగు రోజులకు గాను రూ.27,933 ఇచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. రఘురాం రాజన్ 5 సెప్టెంబర్ 2013లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

English summary
RBI Governor Urjit Patel gets a little over Rs. 2 lakh as salary and has not been provided with any supporting staff at his residence, the central bank has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X