2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన- తిరిగి రాని రూ.6181 కోట్లు..! ఇంకా ఛాన్స్..?
కేంద్రంలో మోడీ సర్కార్ గతంలో నోట్ల రద్దు చేసిన తర్వాత అమల్లోకి తెచ్చిన వాటిలో 2 వేల నోట్లు చాలా కీలకమైనవి. ముఖ్యంగా రాజకీయ నేతలకు సులభంగా లావాదేవీలు చేసుకోవడానికి వీలుగా ఈ నోట్లను కేంద్రం తెచ్చిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆర్బీఐ వీటిని మార్కెట్లో నుంచి ఉపసంహరించుకుంది. అయితే ఇలా ఉపసంహరణ తర్వాత కూడా 2 వేల నోట్ల చెలామణీని ఆర్బీఐ అడ్డుకోలేకపోతోందని తాజాగా చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది.
దేశంలో 2 వేల నోట్ల చెలామణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ కీలక వివరాలతో డేటా విడుదల చేసంది. ఇందులో దేశంలో తాము రెండేళ్ల క్రితమే 2 వేల నోట్లను ఉపసంహరించినా ఇంకా రూ.6181 కోట్ల విలువైన నోట్లు చెలామణీలోనే ఉన్నట్లు గుర్తించింది. 2023 మే 19న ఆర్బీఐ అధికారికంగా 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే వాటిని రద్దు మాత్రం చేయలేదు. దీంతో ఇంకా జనం వద్దే రూ.6181 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. అంతే కాదు వీటిని చెలామణీ కూడా చేసేస్తున్నారు.

2023లో ఆర్బీఐ చేసిన ప్రకటన ప్రకారం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. వీటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కానీ ఈ ఏడాది మే 31 నాటికి ఈ 2 వేల నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం రూ.6,181 కోట్లకు చేరుకుందని తాజాగా వెల్లడించింది. అంటే 98.26% నోట్లు ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే మిగతా నోట్లను కూడా వెనక్కి రప్పించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తోంది.
వాస్తవానికి ఆర్బీఐ జనం తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సాధారణ బ్యాంకు శాఖలలో వీటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు 2023 అక్టోబర్ 7 వరకే గడువు ఇచ్చింది. అది అప్పుడే ముగిసింది. అయినా ఆర్బీఐ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 19 తమ ప్రాంతీయ కార్యాలయాలలో వాటిని స్వీకరిస్తోంది. అలాగే ఇండియా పోస్ట్ ద్వారా కూడా 2 వేల నోట్లను పంపేందుకు అనుమతిస్తోంది. ఆ తర్వాత డబ్బు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు కూడా వినియోగించుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications