బెంగళూరులో మళ్లీ ఎన్నికలు, విసిగిపోయిన ఓటర్లు, డేట్ ఫిక్స్ చేస్తామంటున్న ఎన్నికల కమిషన్!

బెంగళూరు: బెంగళూరు నగరంలోని హెబ్బాళ శాసన సభ నియోజక వర్గం పరిధిలో శనివారం శాసన సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఆ నియోజక వర్గం పదేపదే వార్తల్లో నిలిచింది. హెబ్బాళ శాసన సభ నియోజక వర్గంలోని ఓ పోలింగ్ బూత్ లోని ఈవీఎం ఉదయం నుంచి మొరాయించడంతో స్థానికులు ఒక్కఓటు కూడా వెయ్యలేకపోయారు.

ఉదయం నుంచి గొడవ

ఉదయం నుంచి గొడవ

ఎమ్మెల్యే వచ్చే వరకు పోలింగ్ ప్రారంభం కాకూడదని బీజేపీ కార్యకర్తల గొడవ చెయ్యడం, ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రాల క్యూలైన్ దగ్గర ఓట్లు వెయ్యాలని అభ్యర్థులను వేడుకుంటున్నారని జేడీఎస్ కార్యకర్తల ఆందోళన, ఎన్నికల కమిషన్ అధికారుల మీద బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని వారిని అరెస్టులు చెయ్యడం ఇలా ఈ నియోజక వర్గం వార్తల్లో నిలిచింది.

ఒక్కఓటు పడలేదు

ఒక్కఓటు పడలేదు

హెబ్బాళ నియోజక వర్గంలోని లోట్టేగోల్లహళ్ళిలోని 158వ ఓ పోలింగ్ కేంద్రంలోని ఓటింగ్ యంత్రం శనివారం ఉదయం నుంచి మొరాయించింది. విషయం తెలుసుకున్న నిపుణులు సంఘటనా స్థలానికి చేరకుని ఓటింగ్ యంత్రాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు.

విసిగిపోయిన ఓటర్లు

విసిగిపోయిన ఓటర్లు

ఉదయం నుంచి క్యూలైన్ లో ఉన్న ఓటర్లు ఒక్కొక్కరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వెయ్యడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కఓటు పడకపోవడంతో స్థానికులు విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. లోట్టేగోల్లహళ్ళిలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

పోలింగ్ డేట్ ఫిక్ చేస్తాం

పోలింగ్ డేట్ ఫిక్ చేస్తాం

హెబ్బాళ శాసన సభ నియోజక వర్గంలోని లోట్టేగోల్లహళ్ళిలోని 158వ పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం కమిషనర్ సంజీవ్ కుమార్ శనివారం సాయంత్రం మీడియాకు చెప్పారు. అయితే ఏరోజు పోలింగ్ నిర్వహిస్తామనే విషయం త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+