Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుస్తకాలు చదవండి: జిన్నా వ్యాఖ్యలను సమర్థించుకున్న అఖిలేష్, ‘పాకిస్థాన్‌వా ?’ అంటూ బీజేపీ

లక్నో: పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను ప్రశంసించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నాలు చేశారు. ఆయన జిన్నాను గాంధీతో పోల్చిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల విషయంలో విమర్శిస్తున్నవారు మరోసారి చరిత్ర పుస్తకాలు తిరగేయాలని సూచించారు.

జిన్నా, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అంతా దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడారని, వారందరూ ఒకే సంస్థలో న్యాయవాద పట్టా పొందారని ఇటీవల ఓ సందర్భంలో అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో శనివారం మరోసారి అఖిలేష్ యాదవ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

 Read Books, Says Akhilesh Yadav Over Jinnah; BJP Asks India Or Paks?

పుస్తకాలు తిరగేయాలంటూ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. 'జిన్నాపై ఇంకా ప్రేమ చెక్కు చెదరలేదు. ఇంతకీ ఏ చరిత్ర పుస్తకాలు చదవాలి అఖిలేష్ జీ.. భారత్‌వా..? లేక పాకిస్థాన్‌వా?' అంటూ చురకలంటించారు యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కాగా, తానేక్కడి నుంచైనా పోటీ చేస్తానన్న యోది ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయేవారు ఎక్కడ్నుంచి పోటీ చేస్తే ఏం లాభం? అని అన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా? అనేది పార్టీ నిర్ణయిస్తుందని అఖిలేష్ చెప్పారు. అయితే, తన నిర్ణయం ఎన్నికల్లో పోటీ చేయవద్దనేది మారకపోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్దదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్.. జిన్నాను గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడంపై బీజేపీ నేతలు ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు. పటేల్‌తో పోల్చుతూ జిన్నాను కీర్తించాలని ప్రయత్నించినప్పుడు అతని(అఖిలేష్) విభజన మనస్తత్వం మరోసారి బయటపడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఉత్తర ప్రదేశ్, భారతదేశ ప్రజలు ఈ విభజన మనస్తత్వాన్ని ఎన్నటికీ అంగీకరించరని నేను భావిస్తున్నాను. ఇది తాలిబానీ మైండ్ పైట్. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ సాధనకు కృషి జరుగుతోందని యోగి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+