• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ చీఫ్ పోస్టు నుంచి తప్పుకుంటా - సీనియర్ల లేఖకు సోనియా గాంధీ రిప్లై - సీడబ్ల్యూసీపై టెన్షన్

|

గడిచిన అర దశాబ్ద కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన ఘాటు లేఖపై అధినేత్రి సోనియా గాంధీ అనూహ్యంగా స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం లేఖ అంశం బయటికిరాగా, గంటల వ్యవధిలోనే సోనియా స్పందించారని, కాంగ్రెస్ సారధ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఆమె బదులిచ్చినట్లు తెలుస్తోంది. వరుస పరిణామాలతో సోమవారం జరగబోయే కాంగ్రస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీపై ఉత్కంఠ నెలకొంది.

  Sonia Gandhi -'Will Step Down,Find A New Chief' Sonia Responds To Congress Leaders Letter

  సోనియాకు సీనియర్ల ఘాటు లేఖ - కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన - రేపు సీబడ్ల్యూసీ అనగా.

  నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళనకు సంబంధించి సీనియర్లు పేర్కొన్న అంశాలపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని, కొత్త చీఫ్ ను ఎన్నుకునేంత వరకే తాను సారధ్య బాధ్యతల్లో ఉంటానని గతంలో చెప్పిన మాటను ఆమె గుర్తు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, అందరం కలిసికట్టుగా చర్చించి, కొత్త నాయకుణ్ని ఎన్నుకుందామని కూడా ఆమె సూచించినట్లు తెలిసింది.

   Ready to step down as Congress president Sonia gandhi reportedly reply to seniors letter

  ఈ మేరకు సీనియర్ల లేఖకు ఆమె బదులిచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే,కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని సోనియా గాంధీ ఎక్కడా చెప్పలేదని, ఆ మేరకు మీడియాలో జరుగుతోన్న ప్రచారం వట్టిదేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీలో నాయకత్వ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని, సమావేశంలో తీసుకునే నిర్ణయాలను బట్టే సోనియా తదుపరి అడుగు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  ఎస్పీ బాలు 54ఏళ్ల కళాప్రస్థానం - సుగుణాలు నేర్పారన్న విజయశాంతి - తమిళనాడు సర్కార్ కీలక ప్రకటన

  కాంగ్రెస్ కు సంబంధించి అత్యున్నత మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనుంది. దానికి ఒకరోజు ముందే సీనియర్లు లేఖ రాయడం, దానికి సోనియా రిప్లై ఇవ్వడం కీలకంగా మారింది. పార్టీ తిరిగి పుంజుకునేలా ఫుల్ టైమ్ అధ్యక్షుడు ఉండాలంటూ లేఖ రాసిన సీనియర్లలో కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, రాజ్ బబ్బర్, శశి థరూర్, మనీశ్ తివారి తదితరులున్నారు.

  English summary
  Sonia Gandhi, the Congress interim president has responded to a letter by party 23 top leaders asking for an overhaul within the internal organisation. A meeting of the Congress Working Committee is going to be held on Monday. Sources added that this meeting was called as a response to the letter to discuss the organisational issues pointed out by Congress leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X