కుక్కలను బంధించినందుకు ఉద్యోగాలు పోయాయి

కుక్కలను బంధించినందుకు ఉద్యోగాలు పోయాయి

ముంబై: కుక్కలను బంధించి చిత్రహింసలు పెట్టి బలవంతంగా అవి ఉన్నచోటు నుండి వేరేచోట వదిలేసినందుకు ఇద్దరు ఉద్యోగాలను కోల్పోయారు.

జోన్స్ లాంగ్ లాసల్లె(జేఎల్ఎల్) అనే కార్పోరేట్ రియాల్టీ సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకొంది. జంతు హక్కుల కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది.

ఫీపుల్స్ ఫర్ ఎనిమల్స్ అనే సంస్థకు చెందిన నిరాలి కొరాడియా అనే మహిళ ఈ విషయాన్ని గుర్తించారు. జేఎల్ఎల్ నిర్వహణలో ఉన్న ఓ వాణిజ్య ప్రాంగణంలో ఉండాల్సిన కొన్ని కుక్కలు కన్పించడం లేదని ఆయేషా లోబో అనే మహిళ ఫిర్యాదు చేశారు.ఆమె కుక్కలకు ఆహరం ఇచ్చే విధుల్లో ఉన్నారు.

Realty major sacks two staffers for extreme cruelty to dogs

అయితే అదే సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులే వాటిని బంధించి చిత్రహింసలు పెట్టి వేరే చోటుకు తీసుకెళ్ళి వదిలేసినట్టు తెలిసింది.

దాంతో సంస్థ ఉద్యోగులు జూలియస్, జీకే జగతప్, కె.క్రునాల్ అనే ఇద్దరిపై 15 రోజుల క్రితం అంధేరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కొరాడియా చెప్పారు.

ఈ విషయం గురించి జేఎల్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు కూడ చెప్పామన్నారు. వెంటనే స్పందించిన సదరు కంపెనీ జూలియన్, జగతప్ ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించింది.

క్రునాల్ నేరుగా బాధ్యుడు కాదని, అతడిని వదిలపెట్టారని చెప్పారు. జంతువులను హంసించి లేదా హతమార్చినా ఏమీ కాదనుకొనేవారికి ఇది గుణపాఠమన్నారు.

వాళ్ళు చిత్రహింసలు పెట్టిన కుక్కలు రెండు చాలా ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు కూడ అయిపోయినట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+