ఉద్ధవ్ థాకరేను నిండా ముంచిన శరద్ పవార్
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ సీట్లలో ముందంజలో ఉండటంతో ఆ కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
అయితే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ పార్టీల వైఫ్యలానికి ప్రధాన కారణం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలో ఇక మీద తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఈ ప్రభావం ఎలెక్షన్స్‌లో గట్టిగా పడినట్టు తెలుస్తోంది. ఆయన ఎన్నికలకు దూరంగా ఉండటం ఎన్సీపీతో పాటు, కాంగ్రెస్ , ఉద్ధవ్ థాకరే పార్టీలను నిండా ముంచినట్టు అయింది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు, ఇప్పుడు మాత్రం వెనుకపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13,ఉద్ధవ్ థాకరే(SHSUBT)పార్టీ 9, శరద్ పవార్ (NCPSP) పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ మూడు పార్టీలు వెనుకంజలో ఉన్నాయి.పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా ఉన్నంతగా, అసెంబ్లీ ఎన్నికల్లో లేవని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్రలో పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు బీజేపీ కూటమికి పడ్డాయని నిపుణులు తేల్చేశారు. ఇవన్నీ గల కలిసి కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం అయ్యాయి.












Click it and Unblock the Notifications