వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడే విలీనం ఫెయిల్, పళని దాటవేత: కేంద్రంపై వీరమణి సంచలనం

అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీన ప్రక్రియ అంతా రివర్స్ అయింది. శశికళ, దినకరన్‌లపై వేటు వేయాలని పన్నీరు వర్గం పెట్టిన డిమాండ్లలో ఒకటి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీన ప్రక్రియ అంతా రివర్స్ అయింది. శశికళ, దినకరన్‌లపై వేటు వేయాలని పన్నీరు వర్గం పెట్టిన డిమాండ్లలో ఒకటి. అయితే వారు అధికారికంగా రాజీనామా సమర్పించాలని అప్పుడే విలీనంపై చర్చలు ముందుకు సాగుతాయని అంటున్నారు.

శశికళ, దినకరన్‌లు వెనుక ఉండి ముఖ్యమంత్రి పళనిస్వామి స్వామి వర్గాన్ని ముందు ఉండి నడిపిస్తున్నారనేది పన్నీరుసెల్వం వర్గం అనుమానం. అందుకే వారు రాజీనామా చేశాకనే చర్చలు అని చెబుతోంది.

పన్నీరును సీఎం చేయడం, పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించడం, జయ మృతిపై విచారణ చేయడం, శశికళ కుటుంబానికి చెందిన వారందరినీ పార్టీ నుంచి అధికారికంగా సాగనంపిన తర్వాతే చర్చలు అంటున్నారు. వీటిపై స్పందించకుండా చర్చలు జరిపేది లేదంటున్నారు.

సీఎం పదవిపై పట్టు

సీఎం పదవిపై పట్టు

అయితే, విలీన ప్రక్రియ విఫలం కావడం వెనుక వేరే పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో మొదటిది ముఖ్యమంత్రి పదవి. సీఎం పదవి పన్నీరుకు ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. దీనికి పళనిస్వామి వర్గం ససేమీరా అంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామని చెప్పామని.. ఇక ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తోంది. పళనిస్వామి సీఎం పీఠంపై నుంచి దిగరని చెబుతున్నారు.

ఇక్కడే డౌట్.. జయలలిత మృతి విచారణపై సస్పెన్స్

ఇక్కడే డౌట్.. జయలలిత మృతి విచారణపై సస్పెన్స్

పన్నీరువర్గం పెట్టిన ప్రధాన డిమాండ్లలో జయలలిత మృతిపై సిబిఐ విచారణ జరిపించాలి. కానీ దీనిపై పళనిస్వామి వర్గం పెదవి విప్పడం లేదంటున్నారు. ఇక్కడే పన్నీరు వర్గానికి అనుమానం వస్తోంది. శశికళను పక్కకు తప్పిస్తే.. కచ్చితంగా జయ మృతిపై విచారణకు అంగీకరించేవారని భావిస్తున్నారు.

రాజీ అవసరం ఏమిటని..

రాజీ అవసరం ఏమిటని..

సీఎం సీటు తమకే దక్కాలని పన్నీర్‌ వర్గం, కూడదంటూ ఎడపాడి వర్గం పట్టుపడుతుండగా, రాజీ అవసరమేంటనే వాదన పన్నీర్‌ వర్గంలో మొదలైంది. పన్నీర్, ఎడపాడి వరగాలు ఏకంకావడం ద్వారా అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ప్రయత్నాలు గురువారం ప్రారంభమయ్యాయి. విలీనంపై ఇరువ ర్గాలు ఎవరికి వారు తమ వర్గీయులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించుకున్నారు.

శుక్రవారం మళ్లీ చర్చలకు ఛాన్స్

శుక్రవారం మళ్లీ చర్చలకు ఛాన్స్

మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర సీనియర్‌ నేతలతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. పళని వర్గం మంత్రులు, లోకసభ ఉపస భాపతి తంబిదురై చర్చలు జరిపారు. పన్నీర్‌సెల్వం వర్గం షరతులన్నీ ఆమోదించడమా, మానడమా అని పళని వర్గం మీ మాంసలో పడిపోయింది. శుక్రవారం నుంచి చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది.

డిమాండ్లపై తర్జన

డిమాండ్లపై తర్జన

పన్నీర్‌సెల్వం నిబంధనల్లో ఒకటైన శశికళ కుటుంబా న్ని దూరం పెట్టడం పూర్తయింది. జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చడం, పన్నీర్‌ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకోవడం వరకు పళని వర్గం సమ్మతి స్తోంది. అయితే పన్నీర్‌సెల్వంను సీఎం చేయాలన్న నిబంధనపై పళని వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్నీర్‌సెల్వంతో అత్యవసరంగా చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని పళని వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు నిలదీస్తున్నారు.

పళనిస్వామి దాటవేత

పళనిస్వామి దాటవేత

అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకం కావడంపై సీఎం పళనిస్వామి మాత్రం నోరు మెదపడంలేదు. ఇరు వర్గాల విలీనంపై గురువారం మీడియా ప్రతినిధులు సీఎంను ప్రశ్నించగా... 'ఇది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ గురించి ప్రశ్నలు వద్దు' అని దాటవేశారు. మరోవైపు శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహి ష్కరింపచేయడం ధర్మయుద్ధంలో తమ తొలి విజయమని పన్నీర్‌ చేసిన ప్రకటనను మంత్రి జయ కుమార్‌ ఖండించారు.

కేంద్రం కుట్ర.. మంత్రి వీరమణి

కేంద్రం కుట్ర.. మంత్రి వీరమణి

అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రపన్నిందని మంత్రి వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకసభ ఉప సభాపతి తంబీదురై, మంత్రి జయకుమార్‌ వేర్వేరుగా తమిళనాడు ఇంచార్జి గవర్న ర్‌ విద్యాసాగర్‌రావును చెన్నై రాజ్‌భవన్‌లో కలుసుకు న్నారు. గవర్నర్‌కు కలసిన అనంతరం తంబిదురై సీఎంతో రహస్య చర్చలు జరిపారు.

పన్నీర్‌ వర్గం నిబంధనలు

పన్నీర్‌ వర్గం నిబంధనలు

శశికళ, దినకరన్‌లను బహిష్కరించాలిపన్నీర్‌ను సీఎంగాను, పళనిని డిప్యూటీ సీఎంగాను చేయాలి. తమ వారిలో కొందరికి మంత్రి పదవులివ్వాలి. ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరపాలి. లేదా పన్నీరుకు ఇవ్వాలి. ఎన్నికలు ముగిసేవరకు పార్టీని నడిపించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. పోయెస్‌ గార్డన్‌లోని జయ నివాసాన్ని స్మారక భవనంగా మార్చాలి. కేంద్ర కేబినెట్‌లో భాగస్వాములం కావాలి. ఈ నిబంధనలకు కట్టుబడి చర్చలు ప్రారంభించాలి.

English summary
Here the reasons for failing the merger move of ADMK Factions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X