వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 నెలల తర్వాత పెట్రో మోత-కారణాలివే- ఎంత పెరగొచ్చు ? రష్యా డిస్కౌంట్ ఏమైంది ?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పెట్రో ధరల మోత తిరిగి ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు కాస్త విరామం ఇఛ్చిన కేంద్రం.. పెట్రో ఉత్పత్రులపై ఎక్సైజ్ సుంకాన్ని సైతం తగ్గించింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో 137 రోజుల తర్వాత అంటే దాదాపు 4 నెలల తర్వాత పెట్రో ధరల్ని తిరిగి పెంచడం మొదలుపెట్టేసింది. ఈ మోత ఇక రెగ్యులర్ గా కొనసాగే అవకాశాలున్నాయి. మరోవైపు రష్యా నుంచి డిస్కౌంట్ పై దిగుమతి చేసుకుంటున్న చమురు ప్రభావంతో ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడమేంటనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

పెట్రో ధరల మోత మొదలు

పెట్రో ధరల మోత మొదలు


దేశవ్యాప్తంగా పెట్రో ధరల మోత తిరిగి ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు ధరల పెంపుకు విరామం ఇచ్చిన చమురు సంస్ధలు.. తిరిగి పెంపు ప్రారంభించాయి. దీంతో ఇవాళ అన్ని ప్రధాన నగరాల్లోనూ దాదాపు రూపాయి మేర పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది. 137 రోజుల తర్వాత పెట్రో ధరల మోత తిరిగి ప్రారంభం కావడంతో వినియోగదారుల్లో తిరిగి ఆందోళన మొదలైంది. ఈ ధరలు తిరిగి ఏ స్దాయికి పెరుగుతాయో తెలియక జనం భయపడుతున్నారు.

పెట్రో మోతకు కారణాలివే

పెట్రో మోతకు కారణాలివే

ముడిచమురు ధర భారీగా పెరగడంతో నాలుగు నెలల తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. బ్రెంట్ క్రూడ్ ధర 45 శాతం పెరిగి బ్యారెల్‌కు 118.5 డాలర్లకు చేరుకుంది, చివరిసారిగా ఇంధన ధరలను సవరించినప్పుడు బ్యారెల్ 81.6 డాలర్లుగా ఉంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది.సాధారణంగా, పెట్రోలియం ఉత్పత్తుల బెంచ్‌మార్క్ ధరల 15 రోజుల రోలింగ్ సగటుకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తున్నాయి. అయితే, చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 4 నుంచి ధరల్ని పెంచలేదు. కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.5 తగ్గింపు , డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 తగ్గింపును ప్రకటించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెరగని చమురు ధరలు.. ఇప్పుడు అవికాస్తా ముగియంతో తిరిగి పెరుగుతున్నాయి.

 ఎంత వరకూ పెరగొచ్చు ?

ఎంత వరకూ పెరగొచ్చు ?

చమురు సంస్ధలు తమ మార్కెటింగ్ మార్జిన్‌లను కొనసాగించేందుకు వీలుగా ముడి చమురు ధరలో ప్రతి బ్యారెల్‌కు డాలర్ పెరుగుదలకు పెట్రోల్, డీజిల్ రెండింటి ధరలను దాదాపు రూ.0.52 పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గతంలో ధరల సవరణ నుంచి తీసుకుంటే ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 37 డాలర్లు పెరిగింది కాబట్టి, చమురు కంపెనీలు మార్జిన్‌లు కాపాడుకునేందుకు పెట్రోల్, డీజిల్ రెండింటికీ లీటరుకు రూ.19 చొప్పున ధరలను పెంచాల్సి రావచ్చని అంచనా. వినియోగదారులపై అధిక ముడి చమురు ధర ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కూడా తగ్గించవచ్చని విశ్లేషకుల అంచనా.

రష్యా డిస్కౌంట్ ఏదీ ?

రష్యా డిస్కౌంట్ ఏదీ ?

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ కు చమురు డిస్కౌంట్ పై అమ్మేందుకు రష్యా సిద్ధమైంది. ఈ మేరకు భారత్ లో ప్రధాన చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఐఓసీ మూడు లక్షల బ్యారెళ్ల చమురు డిస్కౌంట్ పై తీసుకునేందుకు ఒప్పందం కూడా కుదిరింది. అయితే ఈ డిస్కౌంట్ ఊరటను వినియోగదారులకు ఇచ్చేందుకు చమురు సంస్ధలు సిద్ధంగా లేనట్లు తేలుస్తోంది. తద్వారా రష్యా డిస్కౌంట్ తో తాము లబ్ది పొందాలనే ఆలోచనలో చమురు సంస్ధలు ఉన్నట్లు అర్ధమవుతోంది.

English summary
after five states assembly elections, oil companies begin petro prices hike in india from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X