MLAs: సీఎం రాయభారం, రెబల్ ఎమ్మెల్యేల హోటల్ లోకి నో ఎంట్రీ, మాటల్లేవ్, మాట్లాడుకోవడాలు లేవు, సారీ!
అహమ్మదాబాద్/ సూరత్/ ముంబాయి: శివసేన పార్టీకి చెందిన రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు సుమారు 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మకాం వేశారు. సూరత్ లో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్న స్టార్ హోటల్ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవ్వరూ హోటల్ లోకి వెళ్లడానికి పోలీసులు అవకాశం ఇవ్వడం లేదు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే దూతలుగా వెళ్లిన ఇద్దరు శివసేన పార్టీ సీనియర్ నాయకులను సైతం సూరత్ లోని హోటల్ కి వెళ్లడానికి అవకాశం ఇవ్వలేదు.
ముంబాయి నుంచి వచ్చిన ఇద్దరు రాయభారులతో లతో మేము మాట్లాడము, వారితో భేటీ కాము, మాటల్లేవ్, మాట్లాడుకోవడాలు లేవు అని హోటల్ లో ఉన్న శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఈ దెబ్బతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ఉన్న ఆశలు ఒక్కొక్కటి అవిరిఅయిపోతా ఉన్నాయని తెలిసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతో ఎస్కేప్
మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా కూటమిలోని సంకీర్ణ ప్రభుత్వానికి శివసేన పార్టీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సినిమా చూపించి రాత్రికి రాత్రి ముంబాయి నుంచి ఎస్కేప్ అయ్యారు.

రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి నాయకుడు
శివసేనకు చెందిన మాస్ లీడర్ ఏక్ నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. శివసేన పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు సుమారు 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లోని సూరత్ లోని ఓ ప్రముఖ హోటల్ లో మకాం వేశారు. సూరత్ లో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఉన్న స్టార్ హోటల్ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం పంపించినా తగ్గెదే లే అంటున్న రెబల్ ఎమ్మెల్యేలు
బయట వ్యక్తులు ఎవ్వరూ శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ లోకి వెళ్లడానికి సూరత్ పోలీసులు అవకాశం ఇవ్వడం లేదు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే దూతలుగా ముంబాయి నుంచి సూరత్ వెళ్లిన శివసేన పార్టీ సీనియర్ నాయకులు మిలింద్ నర్వేకర్, రవీంద్ర ఫాటక్ లు రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే శివసేన పార్టీ సీనియర్ నాయకులు మిలింద్ నర్వేకర్, రవీంద్ర ఫాటక్ లను కలవడానికి రెబల్ ఎమ్మెల్యేలు నిరాకరించారు.

హోటల్ ల్లోకి నో ఎంట్రీ
శివసేన పార్టీ సీనియర్ నాయకులు మిలింద్ నర్వేకర్, రవీంద్ర ఫాటక్ సైతం సూరత్ లోని రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ కి వెళ్లడానికి అవకాశం ఇవ్వలేదు. ముంబాయి నుంచి వచ్చిన ఇద్దరు నాయకులతో మేము మాట్లాడము, వారితో భేటీ కాము అని హోటల్ లో ఉన్న శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఈ దెబ్బతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ఉన్న ఆశలు ఒక్కొక్కటి అవిరిఅయిపోతా ఉన్నాయని తెలిసింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications