వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel: సీఎం గ్రూప్ లోని ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్, తగ్గెదేలే అంటున్న ఏక్ నాథ్, మోదీ ఇలాకాలో మకాం, క్యూలో !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/సూరత్/న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. శివసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ వెళ్లిపోయారని ఏఎన్ఐ మీడియా ట్వీట్ చెయ్యడంతో మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. ఇప్పటికే సీఎం అధికారిక నివాసం ఖాలీ చేసిన ఉద్దవ్ ఠాక్రే ఈరోజు ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని శివసేనకు చెందిన రెబల్ నాయకులు అంటున్నారు. శివసేనకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ?, వాళ్లు ఎందుకు రెబల్ గ్రూప్ లోకి వెళ్లిపోయారు ? అని జోరుగా చర్చ జరుగుతోంది.

Maharashtra: అసెంబ్లీ రద్దు అవుతుందని శివసేన, రద్దు చెయ్యమని మిత్రపక్షం, ఏది నిజం, దేవుడా !Maharashtra: అసెంబ్లీ రద్దు అవుతుందని శివసేన, రద్దు చెయ్యమని మిత్రపక్షం, ఏది నిజం, దేవుడా !

సినిమా చూపిస్తున్న ఏక్ నాథ్

సినిమా చూపిస్తున్న ఏక్ నాథ్

మహారాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే ఎవ్వరూ ఊహించని విదంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. ఇప్పటికే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టిన ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలను పిలుపించుకోవడానికి చాకచక్యంగా పావులు కదుపుతున్నారు.

సీఎం గ్రూప్ లోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

సీఎం గ్రూప్ లోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. మహారాష్ట్రలోని మాహిమ్ నియోజక వర్గం ఎమ్మెల్యే సదా సావార్కార్, కుర్లా నియోజక వర్గం ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జెండా ఎత్తేశారు.

ఒక్క ట్విట్ తో శివసేనకు షాక్

ఒక్క ట్విట్ తో శివసేనకు షాక్


మాహిమ్ నియోజక వర్గం ఎమ్మెల్యే సదా సావార్కార్, కుర్లా నియోజక వర్గం ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి బయటకు వచ్చేసి గుజరాత్ లోని సూరత్ వెళ్లిపోయారని ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్ఐ ట్విట్ చేసింది. ఏఎన్ఐ ట్వీట్ చేసిన తరువాత శివసేన పార్టీకి చెందిన నాయకులతో పాటు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు అయిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మైండ్ బ్లాక్ అయ్యింది.

వెనక్కి తగ్గెదేలే అంటున్న షిండే

వెనక్కి తగ్గెదేలే అంటున్న షిండే

ఇప్పటికే సీఎం అధికారిక నివాసం ఖాలీ చేసిన ఉద్దవ్ ఠాక్రే ఈరోజు ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని శివసేనకు చెందిన రెబల్ నాయకులు అంటున్నారు. అయితే మా నాయకుడు ఉద్దవ్ ఠాక్రే నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కాంగ్రెస్, ఎన్సీపీ నేతల తీరుతోనే మాకు చాలా ఇబ్బందులు ఎదరైనాయని, అందుకే తిరుగుబాటు చేశామని రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే అంటున్నారు.

దేనికైనా రెఢీ

దేనికైనా రెఢీ

మా మీద శివసేన పార్టీ చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా మాకు ఎలాంటి నష్టం లేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసి చాలా తప్పు చేశామని, చేసిన తప్పుకు పరిష్కారం కోసమే మేము తిరుగుబాటు చేశామని ఏక్ నాథ్ షిండే అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మేము మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎలాంటి పరిస్థితిలో అంగీకరించమని ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు.

English summary
Rebel: Two more Maharashtra Shiv Sena MLAs have left for Surat in Gujarat, sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X